ఇండియాలో రెండవ షోరూమ్‌ను ఏర్పాటు చేసిన ఆస్టన్ మార్టిన్
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ ఆస్టన్ మార్టిన్ ఇండియాలో తమ రెండవ డీలర్‌షిప్‌ను దేశ రాజధానిలో ప్రారంభించింది. ఢిల్లీలోని మోహన్ కో-ఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఏరియాలో సుమారు 13,000 చ.అ. విస్తీర్ణంలో ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేయటం జరిగింది. ఆస్టన్ మార్టిన్ తమ తొలి షోరూమ్‌ను ముంబైలో ఏప్రిల్ 2011న ఏర్పాటు చేసింది. ఢిల్లీకు చెందిన సెలక్ట్ కార్స్ భారత్‌లో ఆస్టన్ మార్టిన్ కార్లకు అధీకృత దిగుమతిదారుగా వ్యవహరించనుంది.
ఈ డీలర్‌షిప్‌లో వి12 వాంటేజ్, వాంటేజ్ ఎస్ (కూపే అండ్ రోడ్‌స్టర్), వి8 వాంటేజ్ కూపే, వి8 వాంటేజ్ రోడ్‌స్టర్, డిబి9 కూపే, డిబి9 వొలాంటే, డిబిఎస్ వొలాంటే, ఫోర్-డోర్ ఆస్టన్ మార్టిన్ ర్యాపిడే కార్లను అమ్మకాని ఉంచనున్నారు. ప్రస్తుతం పూర్తిగా విదేశాల్లో తయారైన ఆస్టన్ మార్టిన్ కార్లను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకుని విక్రయించటం జరుగుతుంది.
భారత్‌లో ఆస్టన్ మార్టిన్ లగ్జరీ కార్ల ధరలు రూ.1.8 కోట్లను మొదలుకొని రూ.4 కోట్ల వరకూ ఉన్నాయి. దాదాపు శతాబ్ధపు చరిత్రను కలిగి ఉన్న ఆస్టన్ మార్టిన్ లగ్జరీ కార్లు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్‌ను సంపాధించుకున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆస్టన్ మార్టిన్ తయారు చేసే కార్లన్నీ కూడా చేతులతో రూపొందించినవే (హ్యాండ్ బిల్ట్). మరి ఆస్టన్ మార్టిన్ కార్లు అంత ఖరీదుతో కూడుకున్నవి. జేమ్స్ బాండ్ సినిమాల్లో ఈ కార్లకు ఓ ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది.
ఆస్టన్ మార్టిన్ కంపెనీ గురించి:
ఆస్టన్ మార్టిన్ కంపెనీకు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలలో ఉత్పత్తి కేంద్రాలున్నాయి. వీటి ద్వారా ఏటా 8,000 కార్లను మాత్రమే కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. ఆస్టన్ మార్టిన్‌కు 42 దేశాల్లో 134 డీలర్లు ఉన్నారు. లియోనెల్ మార్టిన్ 1914లో మరియు రాబెర్ట్ బామ్‌ఫోర్డ్‌లు ఆస్టన్ మార్టిన్ స్థాపించారు. 1994 నుంచి 2007 వరకూ ఈ కంపెనీ అమెరికాకు చెందిన కార్ల తయారీ సంస్థ ఫోర్డ్‌లో భాగంగా ఉండేది.
2007లో ఆస్టన్ మార్టిన్ కంపెనీ ఫోర్డ్ నుండి విడిపోయింది. గడచిన సంవత్సరంలో ఆస్టన్ మార్టిన్ అందిస్తున్న సిగ్నెంట్ మినహా బేసిక్ మోడల్ వీ8 వ్యాంటేజ్ నుంచి ఆల్ట్రా-ఎక్స్‌క్లూజివ్ కారు వన్-77 వరకూ అన్ని మోడళ్లను భారత్‌కు పరిచయం చేసింది. ఆస్టన్ మార్టిన్ వన్-77 కారు ప్రస్తుతం భారత్‌లోనే అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కారు.


Click it and Unblock the Notifications








