ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
గ్లోబల్ మార్కెట్లో అత్యంత పాపులర్ అయిన బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆస్టన్ మార్టిన్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ లగ్జరీ వి8 వ్యాంటేజ్ ఎన్నో విశిష్టమైన ప్రత్యేకతలను కలిగి ఉంది. ఆస్టన్ మార్టిన్ నుండి ఇది ప్రారంభ మోడల్ అయినప్పటికీ.. లగ్జరీ కార్ సెగ్మెంట్లో ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాధించుకుంది.
ఆస్టన్ మార్టిన్ కంపెనీ ఈ మోడల్‌ను పూర్తిగా ఎలాంటి యంత్రాలు ఉపయోగించకుండా (హ్యాండ్ బిల్ట్) తయారు చేస్తుంది. అందుకే ఈ కార్లకు ప్రపంచ వ్యాప్తంగా అంత క్రేజ్ ఉంది. ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్ పూర్తి సాంకేతిక, ఇతర సమాచారాన్ని పరిశీలిస్తే...
బాడీ:
* 2 సీట్స్, 2 డోర్ కూపే లేదా సాఫ్ట్ కవర్ కన్వర్టిబల్ టాప్ బాడీ స్టయిల్‌తో ఇది లభిస్తుంది.
* కారు బరువును తగ్గించేందుకు గానూ బాండెడ్ అల్యూమినియం స్ట్రక్చర్‌తో దీనిని రూపొందించారు.
* అల్యూమినియం, మెగ్నీషియం అల్లాయ్, కాంపోసిట్ అండ్ స్టీల్ బాడీ.
* ప్రమాదాలను తట్టుకునేలా తీర్చిదిద్దిన అల్యూమినియం డోర్ సైడ్ ఇంపాక్ట్ బీమ్స్
* అధిక కాంతినిచ్చే హ్యాలోజెన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ (మెయిన్ బీమ్)
* హై ఇంటెన్సిటీ డిశ్చార్డ్ హెడ్‌ల్యాంప్స్ (లో బీమ్)
* ఎల్ఈడి రియర్ ల్యాంప్స్
ఇంజన్:
* 32 వాల్వ్, 4735సీసీ వి8 ఇంజన్
* ఇది ముందువైపు మధ్య భాగంలో అమర్చబడి, రియర్ వీల్ (వెనుక చక్రం) డ్రైవ్‌ను కలిగి ఉంటుంది.
* గరిష్ట శక్తి - 420 బిహెచ్‌పి
* గరిష్ట టార్క్ - 470 ఎన్ఎమ్
పెర్ఫామెన్స్:
* 4.7 సెకండ్లలో 0-60 కి.మీ. వేగం
* 4.9 సెకండ్లలో 0-100 కి.మీ. వేగం
* గరిష్టం వేగం - గంటకు 190 కి.మీ.
ట్రాన్సిమిషన్:
* 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్
వీల్స్ అండ్ టైర్స్:
* ముందు చక్రం - 8.5జె x 19 ఇంచ్
* వెనుక వెనుక చక్రం - 9.5జె x 19 ఇంచ్
* ముందు టైర్ - బ్రిడ్జ్‌స్టోన్ పొటెంజా 235/40 జెడ్ఆర్19
* వెనుక టైర్ - బ్రిడ్జ్‌స్టోన్ పొటెంజా 275/35 జెడ్ఆర్19
బ్రేక్స్:
* ముందు వైపు - వెంటిలేటెడ్ అండ్ గ్రూవ్డ్ స్టీల్ డిస్క్, 355 డయా
* వెనుక వైపు - వెంటిలేటెడ్ అండ్ గ్రూవ్డ్ స్టీల్ డిస్క్, 330 డయా
* డైనమిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (డిఎస్‌సి)
* యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్)
* ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి)
* ఎమెర్జెన్సీ బ్రేక్ అసిస్ట్ (ఈబిఏ)
* ట్రాక్షన్ కంట్రోల్
* పాజిటవ్ టార్క్ కంట్రోల్
ఫీచర్లు:
- పూర్తి లెథర్ ఇంటీరియర్స్
- అల్లాయ్ ఫేసియా ట్రిమ్ అండ్ గ్రాఫైట్ సెంటర్ కన్సోల్ ఫనిష్
- 10-వే ఎలక్ట్రిక్ అడ్జస్టమెంట్‌తో కూడిన స్పోర్టీ సీట్స్
- డ్యూయెల్ స్టేజ్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్
- సైడ్ ఎయిర్ బ్యాగ్స్
- హీటెడ్ రియర్ స్క్రీన్
- ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
- ట్రిప్ మీటర్
- ఎల్ఈడి మ్యాప్ రీడింగ్ లైట్స్
- గ్లాస్ ఈసియూ
- రియర్ పార్కింగ్ సెన్సార్స్
- పవర్ సైడ్ మిర్రర్స్
- టైర్ ప్లెజర్ ఇండికేటర్
- అలారమ్, ఇమ్మొబిలైజర్
- రిమోట్ కంట్రోల్ డోర్ లాకింగ్, బూట్ రిలీజ్
- ట్రాకింగ్ డివైజ్
- యూఎస్‌బి, యాపిల్ ఐప్యాడ్ కెనెక్టివిటీ, 6-సిడి ఆటోమేటిక్ ఛేంజర్‌తో కూడిన 160 వాట్ ఆస్టన్ మార్టిన్ ఆడియో సిస్టమ్
ఆస్టన్ మార్టిన్ వి8 వ్యాంటేజ్‌లో ఈ ఫీచర్లు కేవలం 50 శాతం మాత్రమే. ఇవే కాకుండా... కస్టమర్లు తమ అభిరుచికి తగినట్లుగా వివిధ ఆప్షన్లతో ఈ కారును కస్టమైజ్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








