రాష్ట్ర మార్కెట్లోకి విచ్చేసిన ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ స్పోర్ట్స్ కార్

బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ ఆస్టన్ మార్టిన్ అందిస్తున్న 'డిబిఎస్' మోడల్ స్థానాన్ని రీప్లేస్ చేస్తూ కంపెనీ అభివృద్ధి చేసిన 'వాంక్విష్' మోడల్‌ను కంపెనీ తాజాగా ముంబైలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారత్‌లో ఆస్టన్ మార్టిన్‌కు అధికారిక డీలర్‌గా వ్యవహరిస్తున్న ఇన్ఫినిటీ కార్స్ ప్రత్యేక డివిజన్ ట'పెర్‌ఫార్మెన్స్ కార్స్' ద్వారా ఇది అందుబాటులో ఉండనుంది. ఆస్టన్ మార్టిన్ ఇటీవలే వాంక్విష్ కారును గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. కాగా.. ఈ కొత్త కారును ఆస్టన్ మార్టిన్ శనివారం హైదరాబాద్‌లో ప్రదర్శనకు ఉంచింది.

Aston Martin Vanquish

ఆస్టన్ మార్టిన్ డిబిఎస్ మోడల్‌కు కొనసాగింపుగా ఈ అప్‌గ్రేడెడ్ వెర్షన్ వాంక్విషన్ కారును విడుదల చేస్తున్నామని, పాత వెర్షన్ కన్నా ఇది టెక్నాలజీ పరంగానూ, లుక్ అండ్ స్టయిల్ పరంగాను ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంటుందని కంపెనీ వివరించింది. జూన్ 21, 2012న ఆస్టన్ మార్టిన్ తొలిసారిగా తమ వాంక్విష్ సెడాన్‌ను గ్లోబల్ మార్కెట్‌కు పరిచయం చేసింది.

ఆస్టన్ మార్టిన్ డిబిఎస్ మోడల్‌లో ఉపయోగించిన 6.0 లీటర్ వి12 ఇంజన్‌నే రీ-ఇంజనీరింగ్ చేసి వాంక్విష్ మోడల్‌లో ఉపయోగించారు. ఇది గరిష్టంగా 565 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఇ-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. వాంక్విష్ కేవలం 4.1 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 293 కి.మీ (183 మైళ్ల) వేగంతో పరుగులు తీస్తుంది. పాత వెర్షన్‌తో పోల్చుకుంటే దీని పవర్, టార్క్‌లు అధికం.

భారత మార్కెట్లో ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ ధర రూ.3.85 కోట్లు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉంది. ఆస్టన్ మార్టిన్ వాంక్విష్ కారు వెలుపలి వైపు బాడీ ప్యానెల్స్ మొత్తాన్ని ధృఢమైన కార్బన్ ఫైబర్ మెటీరియల్‌తో తీర్చిదిద్దారు. ఆస్టన్ మార్టిన్ వాంక్విషన్ మోడల్‌లోని కొన్ని డిజైన్ అంశాలను ఈ కంపెనీ నుంచి లభ్యమవుతున్న అత్యంత ఖరీదైన మోడల్ వన్-77 (సుమారు రూ.22 కోట్లు) నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేశారు. లాంబోర్గినీ అవంటేడర్, ఫెరారీ ఎఫ్ఎఫ్ వంటి కార్లకు ఇది గట్టి పోటీగా నిలువనుంది.

More from DriveSpark

Article Published On: Sunday, September 2, 2012, 15:16 [IST]
English summary

 British luxury car maker Aston Martin has showcased its recently launched the all new Vanquish super sports car in Hyderabad. Aston Martin Vanquish is priced at INR 3.85 crore (ex-showroom, Mumbai). The new Vanquish marks an evolution over the previous model. Aston Martin Vanquish makes 565 bhp, takes 4.1 seconds to hit a tonne and goes flat out all the way up to 183 mph.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+