నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్‌పై బంపర్ ఆఫర్

జపనీస్ కార్ మేకర్ నిస్సాన్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ నిస్సాన్ మైక్రాపై మంచి ఆఫర్‌ను అందిస్తోంది. నిస్సాన్ మైక్రా కొనగోలుపై వినియోగదారులు కేవలం ఒక్క రూపాయికే బీమాను, రూ.10,000 విలువైన యాక్ససరీలను మరియు ఎక్సేంజ్ ఆఫర్‌లో కారును కొనుగోలు చేసేవారికి వారి పాత కారు విలువపై అదనంగా రూ.15,000 లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. త్వరపడండి ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రేమ.

నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్ నాలుగు పెట్రోల్ వేరియంట్లు, రెండు డీజిల్ వేరియంట్లలో లభ్యమవుతుంది. పెట్రోల్ వేరియంట్ నిస్సాన్ మైక్రాలో 1.2 లీటర్, డిఓహెచ్‌సి, 12-వాల్వ్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 76 పిఎస్‌ల శక్తిని, 104 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 18.06 కి.మీ. మైలేజీనిస్తుంది.

ఇకపోతే డీజిల్ వేరియంట్‌ నిస్సాన్ మైక్రాలో 1.5 లీటర్, ఎస్ఓహెచ్‌సి, 8-వాల్వ్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 64 పిఎస్‌ల శక్తిని, 160 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 23.08 కి.మీ. మైలేజీనిస్తుంది. ఈ రెండు వేరియంట్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తాయి.

నిస్సాన్ మైక్రా కేవలం 4.6 మీటర్ల టర్నింగ్ రేడియస్‌ను మాత్రమే కలిగి ఉండి మంచి చిన్న రోడ్లపై సైతం సౌకర్యవంతంగా డ్రైవ్ చేసేందుకు సహకరిస్తుంది. ఇందులో పవర్ స్టీరింగ్, స్టీరింగ్ టిల్ట్ అడ్జస్టమెంట్, పవర్ విండోస్, సెంట్రల్ డోర్ లాంక్, పుష్ బటన్ స్టార్ట్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

నిస్సాన్ మైక్రా వేరియంట్లు, ధరలు ఈ విధంగా ఉన్నాయి:
* Nissan Micra XE (Petrol) - Rs. 4,21,765
* Nissan Micra XE Plus (Petrol) - Rs. 4,49,263
* Nissan Micra XL (Petrol) - Rs. 4,84,916
* Nissan Micra XV (Petrol) - Rs. 5,51,932
* Nissan Micra XV (Diesel) - Rs. 5,96,408
* Nissan Micra XV Premium (Diesel) - Rs. 6,41,558
(*All prices Ex-Showroom Delhi)

More from DriveSpark

Article Published On: Wednesday, August 29, 2012, 12:05 [IST]
English summary
Japanese carmaker Nissan India is offering attractive schemes on its entry level hatchback Micra. Now customers will get insurance at Rs.1, accessories worth Rs.10,000 and exchange bonus of Rs.15,000 on the purchase of Nissan Micra.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+