ఇండియాలో క్యూ7 ఎస్‌యూవీ ఉత్పత్తిని ప్రారంభించిన ఆడి
జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ 'ఆడి ఇండియా' దేశీయ విపణిలో క్యూ సిరీస్‌లో అందిస్తున్న విలాసవంతమైన కారు 'ఆడి క్యూ7' ఇకపై మరింత తక్కువ ధరకే ఇండియన్ మార్కెట్లో లభ్యం కానుంది. ఆడి క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీని కంపెనీ ఇప్పటి వరకూ సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్‌లో ఇండియన్ మార్కెట్లో దిగుమతి చేసుకొని కంపెనీ ఇక్కడి మార్కెట్లో విక్రయించడం జరుగుతోంది. భారత్‌లో ప్రస్తుతం అమల్లో ఉన్న అధిక దిగుమతి సుంఖాల కారణంగా ఈ కారు ధర అధికంగా ఉంటోంది.
ఈ నేపథ్యంలో, ఆడి ఇండియా తమ క్యూ7 ఎస్‌యూవీని భారత్‌లోనే అసెంబ్లింగ్ చేయాలని నిర్ణయించింది. ఔరంగాబాద్‌లోని ప్లాంట్‌లో ఆడి ఈ క్యూ7 ఎస్‌యూవీ అసెంబ్లింగ్‌ను ఇటీవలే ప్రారంభించింది. విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఈ ప్లాంటులో అసెంబ్లింగ్ చేయనుంది. ఇలా చేయటం వలన దిగుమతి సుంఖాలు తగ్గి తక్కువ ధరకే ఈ కారును అందించే ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం ఆడి ఇండియా దేశీయ విపణిలో ఆడి ఏ4, ఆడి ఏ6, ఆడి క్యూ5 మోడళ్లను అసెంబ్లింగ్ చేస్తోంది. కాగా.. ఆడి క్యూ7 ఇండియాలో అసెంబ్లింగ్ కానున్న నాల్గవ ఉత్పత్తి.

ఆడి క్యూ7 ఉత్పత్తి
జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ 'ఆడి ఇండియా' దేశీయ విపణిలో క్యూ సిరీస్‌లో అందిస్తున్న విలాసవంతమైన కారు 'ఆడి క్యూ7' ఇకపై మరింత తక్కువ ధరకే ఇండియన్ మార్కెట్లో లభ్యం కానుంది.

ఆడి క్యూ7 ఉత్పత్తి
ఆడి క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీని కంపెనీ ఇప్పటి వరకూ సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్‌లో ఇండియన్ మార్కెట్లో దిగుమతి చేసుకొని కంపెనీ ఇక్కడి మార్కెట్లో విక్రయించడం జరుగుతోంది.

ఆడి క్యూ7 ఉత్పత్తి
ఔరంగాబాద్‌లోని ప్లాంట్‌లో ఆడి ఈ క్యూ7 ఎస్‌యూవీ అసెంబ్లింగ్‌ను ఇటీవలే ప్రారంభించింది. విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఈ ప్లాంటులో అసెంబ్లింగ్ చేయనుంది.

ఆడి క్యూ7 ఉత్పత్తి
ఇండియన్ మార్కెట్లో ఆడి క్యూ7 మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్లతో పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో లభ్యమవుతుంది.
ఆడి క్యూ7 వీడియో
ఇండియన్ మార్కెట్లో ఆడి క్యూ7 మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్లతో పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇందులో 3.0 లీటర్ టిడి క్వాట్రో డీజిల్ ఇంజన్ 180 కి.వా. శక్తిని, 550 ఎన్ఎమ్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 12.62 కి.మీ. మైలేజీనిస్తుంది. అలాగే, 4.2 లీటర్ టిడిఐ క్వాట్రో డీజిల్ వేరియంట్ గరిష్టంగా 250 కి.వా. శక్తిని, 800 ఎన్ఎమ్ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటర్ డీజిల్‌కు 10.10 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.
ఇకపోతే 3 లీటర్ టిఎఫ్ఎస్ఐ క్వాట్రో వి6-సిలిండర్ పెట్రోల్ వేరియంట్ గరిష్టంగా 245 కి.వా. శక్తిని, 440 ఎన్ఎమ్ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు 8.62 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఈ మూడు ఇంజన్లు కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభ్యమవుతాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన భద్రతా ఫీచర్లతో ఆడి ఇండియా తమ పవర్‌ఫుల్ క్యూ7 ఎస్‌యూవీని అభివృద్ధి చేసింది భారత మార్కెట్లో ఆడి క్యూ7 ఎస్‌యూవీ ధరలురూ.55 లక్షల నుంచి రూ.65 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








