జనవరి నుంచి 3.69 లక్షర మేర ప్రియం కానున్న ఆడి కార్లు

By Ravi

కొత్త సంవత్సరంలో లగ్జరీ కార్లు మరింత ప్రియం కానున్నాయి. జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా దేశీయ విణిలో అందిస్తున్న అన్ని కార్ల ధరలు వచ్చే జనవరి నుంచి పెరగనున్నాయి. ఈ ధరల పెంపు మోడళ్లను బట్టి రూ.59,000 నుంచి రూ.3,69,000 రేంజ్‌లో ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. తాము ఇదివరకే పేర్కొన్నట్లుగా, మొత్తమ్మీద మార్కెట్ పరిస్థితులు సవాలుగా మారాయని, పెరిగిన ఉత్పాదక వ్యయం, పతనమవుతున్న రూపాయి మారకపు విలువ, నిరంతరాయంగా పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ధరలకు పెంచక తప్పడం లేదని ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెష్కీ తెలిపారు.

ఆడి ఏ4, ఆడి ఏ6, ఆడి ఏ7 స్పోర్ట్‌బ్యాక్, ఆడి ఏ8ఎల్, ఆడి క్యూ5, ఆడి క్యూ3, ఆడి క్యూ5, ఆడి క్యూ7, ఆడి ఎస్4, ఆడి ఆర్ఎస్5 కూపే, ఆడి టిటి కూపే, ఆడి ఆర్8 సూపర్ స్పోర్ట్స్ కార్, ఆడి ఆర్8 స్పైడర్ కార్లను ఆడి ఇండియా దేశీయ విపణిలో అందిస్తుంది. భారత మార్కెట్లో వీటి ధరలు రూ.27.85 లక్షల నుంచి రూ.1.7 కోట్లు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నాయి. అహ్మదాబాద్, బెంగుళూరు, భోఫాల్, ఛండీఘడ్, చెన్నై, కోయంబత్తూర్, ఢిల్లీ సౌత్, ఢిల్లీ వెస్ట్, గుర్గావ్, గోవా, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, కొచ్చి, కోల్‌కటా, లుథియానా, ముంబై వెస్ట్, నాగ్‌పూర్, నావీ ముంబై, పూనే, రాయ్‌పూర్, సూరత్ నగరాల్లో ఆడి ఇండియా షోరూమ్‌లు ఉన్నాయి.

Audi Price Hike

More from DriveSpark

Article Published On: Friday, December 28, 2012, 11:32 [IST]
English summary
Audi, the German luxury car manufacturer, today announced the details of increase in prices of its model range available in India. The price increase would range between INR 59,000 to INR 369,000 (ex-showroom Delhi) across the model range from January 1, 2013.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+