జనవరి నుంచి 5 శాతం పెరగనున్న ఆడి కార్ల ధరలు

వచ్చే జనవరి నుంచి ఆడి కార్ల ధరలు పెరగనున్నాయి. దేశీయ విపణిలో తాము అందిస్తున్న అన్ని కార్ల ధరలను జనవరి 1, 2013 నుంచి 5 శాతం మేర పెంచుతామని జర్మనీకు చెందిన లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు సవాలుగా మారాయని, పెరుగుతున్న ఉత్పాదక వ్యయం, క్షీణిస్తున్న రూపాయి మారకపు విలువ, దిగిరాని ఇంధన ధరల నేపథ్యంలో తమ ఉత్పత్తుల ధరలు పెంచక తప్పడం లేదని ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ తెలిపారు.

ఏదేమైనప్పటికీ, తమ వినియోగదారుల కోసం ఆడి ఫైనాన్స్ నుంచి ఆకర్షణీయమైన ఫైనాన్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నామని, ఇది వారి కొనుగోలును మరింత ఆకర్షనీయంగా మార్చగలదని ఆయన చెప్పారు. సవాళ్లు ముందున్నప్పటికీ, భారత లగ్జరీ కార్ మార్కెట్లో తాము ముందుకు దూసుకు వెళ్తున్నామని, ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 8,000 వాహనాలను విక్రయించాలనే లక్ష్యంతో ఉన్నామని మైఖేల్ ప్రెస్కీ తెలిపారు.

Audi Q7

గడచిన అక్టోబర్ నెలలో ఆడి ఇండియా భారత మార్కెట్లో మొత్తం 850 కార్లను విక్రయించి గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 76 శాతం వృద్ధిని తన ఖాతాలో వేసుకుంది. ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ ఆడి ఇండియా మొత్తం 7267 వాహనాలను విక్రయించింది. ప్రస్తుతం ఆడి ఇండియాకు దేశవ్యాప్తంగా 23 డీలర్‌‌షిప్‌లు ఉన్నాయి. 2012 చివరి నాటికి ఈ సంఖ్యను 25కు పెంచుకునేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

అహ్మదాబాద్, బెంగుళూరు, భోఫాల్, ఛండీఘడ్, చెన్నై, కోయంబత్తూర్, ఢిల్లీ సౌత్, ఢిల్లీ వెస్ట్, గుర్గావ్, గోవా, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, కొచ్చి, కోల్‌కటా, లుథియానా, ముంబై వెస్ట్, నాగ్‌పూర్, నావీ ముంబై, పూనే, రాయ్‌పూర్, సూరత్ నగరాల్లో ఆడి ఇండియా షోరూమ్‌లు ఉన్నాయి. ఆడి ఏ4, ఆడి ఏ6, ఆడి ఏ7 స్పోర్ట్‌బ్యాక్, ఆడి ఏ8ఎల్, ఆడి క్యూ5, ఆడి క్యూ3, ఆడి క్యూ5, ఆడి క్యూ7, ఆడి ఎస్4, ఆడి ఆర్ఎస్5 కూపే, ఆడి టిటి కూపే, ఆడి ఆర్8 సూపర్ స్పోర్ట్స్ కార్, ఆడి ఆర్8 స్పైడర్ కార్లను ఆడి ఇండియా దేశీయ విపణిలో అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, November 16, 2012, 12:25 [IST]
English summary
Audi, the German luxury car manufacturer, today announced an increase in price of its model range available in India. The increase would range up to 5 percent across model from January 1, 2013.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+