ఆడి జాక్‌పాట్: ఒక నెల కన్నా ముందే టార్గెట్ ఫినిష్!

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా మొత్తానికి లక్ష్యాన్ని సాధిచింది. ఆడి ఇండియా గడచిన నెలలో మొత్తం 805 కార్లను విక్రయించి, గతేడాది ఇదే సమయంతో పోల్చుకుంటే 89 శాతం వృద్ధిని కనబరిచింది. నవంబర్ 2011లో ఆడి ఇండియా కేవలం 425 కార్లను మాత్రమే విక్రయించింది. ఈ సంవత్సరంలో ఆడి ఇండియా 8,000 కార్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా.. నవంబర్ నెల అమ్మకాలతో కంపెనీ ఈ లక్ష్యాన్ని అనుకున్న సమయం కన్నా ముందుగానే పూర్తి చేసినట్లయింది.

కంపెనీ కొత్తగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఎంట్రీ లెవల్ కారు క్యూ3, విస్తరించుకుంటున్న తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్ అలాగే కొత్త ఉత్పత్తుల కారణంగా భారత్‌లో ఆడి ఇండియా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. డిసెంబర్ నెల ఇంకా మిగిలి ఉన్న నేపథ్యంలో, ఆడి ఇండియా ఏడాది ముగిసే నాటికి 8,600 కార్లను విక్రయించగలమన్న ధీమాతో ఉంది. ఇదే గనుక జరిగితే భారత్‌లో ఆడి ఇండియా అత్యధిక అమ్మకాల రికార్డు నమోదు కానుంది. అంతేకాకుండా, అమ్మకాల పరంగా ఇది ఇండియాలోనే అగ్రగామి లగ్జరీ కార్ బ్రాండ్‌గా కూడా నిలిచే అవకాశం ఉంది.

Audi

Article Published On: Thursday, December 6, 2012, 18:48 [IST]
English summary
German luxury carmaker Audi India registered sales of 805 units for the month of Nov 2012. Compared to Nov 2011, when Audi India sold 425 cars, this is a whopping 89% jump in car sales. With the Nov 2012 Audi India has already surpassed its sales target of 8,000 units for this year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+