సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లోకి ప్రవేశించనున్న ఆడి
ఇకపై ఆడి కార్లను సొంతం చేసుకోవటం చాలా సులువు కానుంది. ఖరీదైన ఆడి లగ్జరీ కార్లు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి రానున్నాయి. జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ 'ఆడి ఇండియా' భారత మార్కెట్లో సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా, ఈ డిసెంబర్ నెల చివరి నాటికి 'ఆడి అప్రూవ్డ్ ప్లస్' అనే ఎక్స్‌క్లూజివ్ ప్రీ-ఓన్డ్ కార్ షోరూమ్‌లను కంపెనీ ప్రారంభించనుంది.
ఆడి అప్రూవ్డ్ ప్లస్ షోరూమ్‌లో సగటున 4-5 ఏళ్లు పాతబడిన ఆడి కార్లను విక్రయించనున్నారు. ఒక్కొక్క షోరూమ్‌లో దాదాపు 8-10 ఆడి సెకండ్ హ్యాండ్ కార్లను ప్రదర్శనకు ఉంచుతారు. ఉదాహరణకు, సెకండ్ హ్యాండ్ మార్కెట్లో 2009 మోడల్ ఆడి ఏ4 కారు ధర రూ.18-19 లక్షల రేంజ్‌లో ఉండొచ్చు. ఇదే మోడల్ కొత్తదైతే దీని ధర రూ.30.10 లక్షలుగా ఉంటుంది. అధీకృత ఆడి డీలర్లు, తమ డీలర్‌షిప్‌లకు సమీపంలో ఈ ప్రీ-ఓన్డ్ ఆడి షోరూమ్‌లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

ఆడి ఏ4

ఆడి ఏ6

ఆడి ఏ8

ఆడి ఏ8ఎల్

ఆడి టిటి

ఆడి క్యూ3

ఆడి క్యూ5



Click it and Unblock the Notifications








