భారత్‌లో ఆడి క్లాసిక్ క్రోనోగ్రాఫ్ చేతి ఘడియారం విడుదల
భారత్‌లో లగ్జరీ కార్లను విక్రయించే జర్మన్ కార్ కంపెనీ ఆడి, ఇప్పుడు ఇండియాలో చేతి ఘడియాలను కూడా అమ్ముతోంది. జర్మనీలో తయారైన క్లాసిక్ క్రోనోగ్రాఫ్ చేతి ఘడియారాన్ని ఆడి ఇండియా భారత్‌లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ వాచ్ భారత్‌లో ఉన్న అన్ని అధీకృత ఆడి ఇండియా డీలర్‌షిప్ కేంద్రాల్లో విక్రయానికి అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.
ఆడి క్లాసిక్ క్రోనోగ్రాఫ్ వ్రిస్ట్‌వాచ్ ఫీచర్లు:
* పెద్ద సైజుతో ఉండే అంకెలు
* డేట్ డిస్‌ప్లే
* డబుల్ స్టాప్ ఫంక్షన్
* వేగాన్ని కొలిచే టాచీమీటర్ స్కేల్
* స్విస్ రోండా 5020
* బి క్వార్ట్జ్ మూవ్‌మెంట్
* వాటర్ ఫ్రూప్
* బ్లాక్ లెథర్ స్ట్రాప్
లగ్జరీ కారు కొనుగోలుదారులు వారి కార్లతో పాటుగానే వారి స్టయిల్‌ను ప్రతిభింభింపజేసే యాక్ససరీలను కోరుకుంటుంటారని, అలాంటి వారి కోసమే ఈ విలాసమైన యాక్ససరీలను అందుబాటులోకి తీసుకువచ్చామని ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ తెలిపారు. ఈ మేడ్ ఇన్ జర్మనీ ఆడి క్లాసిక్ క్రోనోగ్రాఫ్ చేతి ఘడియారం కేవలం నలుపు రంగులో మాత్రమే లభ్యమవుతుంది. భారత మార్కెట్లో ఈ ఆడి చేతి ఘడియారం ధర జస్ట్ రూ.21,499/- మాత్రమే. ఆడి బ్రాండ్ వాచ్ సొంతం చేసుకోవాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టక తప్పదు మరి.


Click it and Unblock the Notifications









