రాష్ట్ర మార్కెట్లో ఆడి క్యూ3 ఎస్‌యూవీ విడుదల

జర్మన్ లగ్జరీ కార్ మేకర్ ఆడి ఇండియా, ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త కాంపాక్ట్ లగ్జరీ ఎస్‌యూవీ 'ఆడి క్యూ3'ని కంపెనీ తాజాగా రాష్ట్ర మార్కెట్లో విడుదల చేసింది. హైదరాబాద్ మార్కెట్లో ఆడి క్యూ3 ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధరలు రూ.28,80,500 నుంచి రూ.34,29,500 రేంజ్‌లో ఉన్నాయి. ఈ సెగ్మెంట్లోనే తొలిసారిగా ఆడి క్యూ3లో క్వాట్రో పవర్‌ట్రైన్ ఇంజన్‌ను ఆడి ఉపయోగించింది.

ఈ ఏడాది జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆడి ఇండియా తొలిసారిగా ఆడి క్యూ3 ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఆడి క్యూ3 లగ్జరీ ఎస్‌యూవీ రెండు వేరియంట్లలో, 2.0 టిడిఐ ఇంజన్‌‌తో లభ్యమవుతుంది. ఆడి ప్రారంభంలో భాగంగా కేవలం 500 ఆడి క్యూ3 ఎస్‌యూవీలకు మాత్రమే కంపెనీ బుకింగ్‌లను తీసుకోనుంది. ఆడి ఇండియాకు దేశవ్యాప్తంగా ఉన్న 19 డీలర్‌షిప్‌ల ద్వారా ఆడి క్యూ3 ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చు.


ప్రస్తుతం ఆడి ఇండియాకు దేశవ్యాప్తంగా 19 డీలర్‌‌షిరప్‌లు ఉండగా, 2012 చివరి నాటికి ఈ సంఖ్యను 25కు పెంచుకునేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఆడి ఏ4, ఆడి ఏ6, ఆడి ఏ7 స్పోర్ట్‌బ్యాక్, ఆడి ఏ8ఎల్, ఆడి క్యూ5, ఆడి క్యూ7, ఆడి ఆర్ఎస్5 కూపే, ఆడి టిటి, ఆడి ఆర్8 సూపర్ స్పోర్ట్స్ కార్, ఆడి ఆర్8 స్పైడర్ కార్లను ఆడి ఇండియా దేశీయ విపణిలో అందిస్తుంది. అహ్మదాబాద్, బెంగుళూరు, ఛండీఘడ్, చెన్నై, కోయంబత్తూర్, ఢిల్లీ సౌత్, ఢిల్లీ వెస్ట్, గుర్గావ్, హైదరాబాద్, ఇండోర్, భోఫాల్, జైపూర్, కొచ్చి, కోల్‌కటా, లుథియానా, ముంబై వెస్ట్, నాగ్‌పూర్, పూనే, సూరత్ నగరాల్లో ఆడి ఇండియా షోరూమ్‌లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, June 11, 2012, 11:01 [IST]
English summary
German luxury carmaker Audi has launched the sporty Q3 crossover at a competitive price tag of Rs 28,80,500 lakhs (ex-showroom Hyderabad) in AP market. The Q3 which was showcased at the 2012 Delhi Auto Expo has been made available in two trims.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+