లీటరుకు 91 కిలోమీటర్ల మైలేజీనిచ్చే ఆడి కారు
పెరుగుతున్న ఇంధన ధరలకు చెక్ పెడుతూ, భవిష్యత్ రవాణా కోసం తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజీనిచ్చే వాహనాలను రూపొందించే దిశగా ఆటోమొబైల్ కంపెనీలు ముందడుగు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కోవలోనే జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి కూడా ఇలాంటి ఓ అద్భుతమైన కాన్సెప్ట్ కారును రూపొందించింది. లీటరు ఇంధనానికి ఏకంగా 91 కిలోమీటర్ల మైలేజీనిచ్చే కారుని అభివృద్ధి చేసింది.
ఆడి ఇటీవల మార్కెట్లో విడుదల చేసి ఆడి క్యూ3 కారు కన్నా చిన్నగా ఉండేలా ఓ సరికొత్త పెట్రోల్ హైబ్రిడ్ కారును కంపెనీ తయారు చేసింది. 'ఆడి క్యూ2'గా పిలిచే ఈ క్రాస్‌లైన్ కూపే కాన్సెప్ట్ కారు ఇటు పెట్రోల్ ఇంజన్‌తో అటు ఎలక్ట్రిక్ మోటార్‌ను నడుస్తుంది. ఇందులో 1.5లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 130 బిహెచ్‌పిల శక్తిని, 210 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా, ఆడి క్యూ2 హైబ్రిడ్ కారులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవి వరుసగా 68 బిహెచ్‌పిలు, 116 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తాయి.

ఆడి క్యూ2 - కాన్సెప్ట్ కారు
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఓ అద్భుతమైన కాన్సెప్ట్ కారును రూపొందించింది. లీటరు ఇంధనానికి ఏకంగా 91 కిలోమీటర్ల మైలేజీనిచ్చే ఓ హైబ్రిడ్ కారుని ఆడి అభివృద్ధి చేసింది.

ఆడి క్యూ2 - హైబ్రిడ్ కారు
ఆడి క్యూ2గా పిలిచే ఈ క్రాస్‌లైన్ కూపే కాన్సెప్ట్ కారు ఇటు పెట్రోల్ ఇంజన్‌తో అటు ఎలక్ట్రిక్ మోటార్‌ను నడుస్తుంది. ఇందులో 1.5లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 130 బిహెచ్‌పిల శక్తిని, 210 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఆడి క్యూ2 - కన్వర్టిబల్
ఆడి క్యూ2 2+2 సీటింగ్‌ను కలిగి ఉండి అవసరం లేదనుకున్నప్పుడు కారు పైభాగాన్ని (కన్వర్టిబల్ రూఫ్) ఆటోమేటిక్‌గా మడిచే వీలుంటుంది.

ఆడి క్యూ2 - పెర్ఫామెన్స్
ఆడి క్యూ2 క్రాస్‌లైన్ కూపే, బ్యాటరీ ద్వారా పనిచేసేటప్పుడు కేవలం 9.8 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. అదే డ్యూయెల్ మోడల్‌లో పనిచేస్తున్నప్పుడైతే ఇది కేవలం 8.6 సెకండ్ల వ్యవధిలోనే ఈ వేగాన్ని అందుకుంటుంది.

ఆడి క్యూ2 - మైలేజ్
ఈ డ్యూయెల్ మోడ్ హైబ్రిడ్ కారు అద్భుతమైన శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ డ్యూయెల్ మోడ్ కేవలం కారు పవర్‌ను పెంచడమే కాకుండా, అద్భుతమైన మైలేజీనివ్వటంలో కూడా సహకరిస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 91 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.
ఈ డ్యూయెల్ మోడ్ హైబ్రిడ్ కారు అద్భుతమైన శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో అమర్చిన రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కారులో అమర్చిన బ్యాటరీల సాయంతో పనిచేస్తాయి. ఇందులో ఒకటి టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌ను స్టార్ట్ చేయగా, మరొక మోటార్ కారును 55 కిలోమీటర్ల వేగానికి తీసుకువస్తుంది. ఒక్కసారి ఈ వేగాన్ని దాటిన తర్వాత పెట్రోల్ ఇంజన్ సాయంతో గరిష్టంగా ఈ కారును 182 కిలోమీటర్ల వేగంతో నడపవచ్చు.
ఆడి క్యూ2 క్రాస్‌లైన్ కూపే, బ్యాటరీ ద్వారా పనిచేసేటప్పుడు కేవలం 9.8 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. అదే డ్యూయెల్ మోడల్‌లో పనిచేస్తున్నప్పుడైతే ఇది కేవలం 8.6 సెకండ్ల వ్యవధిలోనే ఈ వేగాన్ని అందుకుంటుంది. ఈ డ్యూయెల్ మోడ్ కేవలం కారు పవర్‌ను పెంచడమే కాకుండా, అద్భుతమైన మైలేజీనివ్వటంలో కూడా సహకరిస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 91 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.
ఆడి క్యూ2 2+2 సీటింగ్‌ను కలిగి ఉండి అవసరం లేదనుకున్నప్పుడు కారు పైభాగాన్ని (కన్వర్టిబల్ రూఫ్) ఆటోమేటిక్‌గా మడిచే వీలుంటుంది. ఇది ఆడి తయారు చేసిన అత్యంత చిన్న క్రాసోవర్ కావటం విశేషం. నేటి నుండి ప్రారంభం కానున్న అంతర్జాతీయ ప్యారిస్ మోటార్ షోలో ఆడి తమ క్యూ2 క్రాస్‌లైన్ కూపే కాన్సెప్ట్ కారును ప్రదర్శనకు ఉంచింది. వీటి చిత్రాలను పై ఫోటో ఫీచర్ కథనంలో గమనించవచ్చు.


Click it and Unblock the Notifications








