ఏడాది చివరి నాటికి 'ఆర్ఈ60' విడుదల: బజాజ్ ఆటో
బజాజ్ ఆటో ఆవిష్కరించిన మినీ ఫోర్-వీలర్ 'బజాజ్ ఆర్ఈ60'ను వాణిజ్య పరంగా మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ ముహుర్తం ఖరారు చేసింది. ప్రస్తుతం ఆర్థిక చివరి నాటికి ఈ ఫోర్-వీలర్‌ను దేశీయ విపణిలో అమ్మకానికి అందుబాటులోకి తీసుకువస్తామని బజాజ్ ఆటో పేర్కొంది.
"ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆర్ఈ60 వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమవుతుంది, అదే సమయానికి దీనిని మార్కెట్లోకి విడుదల చేయడం కూడా జరుగుతుంద"ని బజాజ్ ఆటో లిమిటెడ్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (బిజినెస్ డెవలప్‌మెంట్) ఎస్ రవికుమార్ తెలిపారు.
గడచిన జనవరిలో న్యూఢిల్లీలో జరిగిన 11వ అంతర్జాతీయ ఆటో ప్రదర్శన సమయంలో బజాజ్ ఆటో తొలిసారిగా ఆర్ఈ60 ఫోర్-వీలర్‌ను ప్రజలకు పరిచయం చేసింది. బజాజ్ ఆర్ఈ60లో ఓ 200సీసీ పెట్రోల్ ఇంజన్‌ను వెనుక వైపు అమర్చబడి ఉంటుంది.
Bajaj RE60 Four-Wheeler Photo Gallery:
బజాజ్ ఆర్ఈ60 గరిష్టంగా 70 కి.మీ. వేగంతో పరుగులు తీస్తూ, లీటర్ పెట్రోల్‌కు 35 కి.మీ. వరకూ మైలేజీనిస్తుంది. ఈ ఫోర్-వీలర్‌ను అభివృద్ధి చేయడానికి బజాజ్ ఆటోకు నాలుగు సంవత్సరాల సమయం పట్టింది. బజాజ్ ఆర్ఈ60 ఫోర్-వీలర్‌ను అంతర్జాతీయ మార్కెట్లలో సైతం విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది.
బజాజ్ ఆర్ఈ60 కారు ఫీచర్లు:
* 200సీసీ పెట్రోల్ ఇంజన్
* సిటీ ట్రాఫిక్‌లకు, రోడ్లకు చక్కగా సరిపోతుంది.
* గరిష్ట వేగం గంటకు 70 కి.మీ.
* ప్రకృతి సాన్నిహిత్యమైనది (ఎకో-ఫ్రెండ్లీ)
* ఫోర్ సీటర్ (నలుగురు ప్రయాణికులు సులువుగా ప్రయాణించవచ్చు)
* కారు పొడవు x వెడల్పు x ఎత్తు : 2752 మి.మీ. x 1312 మి.మీ. x 1650 మి.మీ.
* కారు మొత్తం బరువు: 400 కేజీలు
* కనీస టర్నింగ్ రేడియస్ - 3.5 మీటర్లు
* లగేజ్ (బూట్) స్పేస్ - 44 లీటర్లు
* అంచనా ధర - రూ.1 లక్ష నుండి రూ.1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్)


Click it and Unblock the Notifications









