అమల్లోకి వచ్చిన కార్లకు అక్రమ సన్‌ఫిల్మ్‌ల వాడటంపై నిషేధం

వాహనాలకు పరిమితులకు మించి సన్‌ఫిల్మ్‌ (కారు అద్దాలపై కవర్ చేసే నల్లటి స్టిక్కర్)లను ఉపయోగించడాన్ని నిషేధిస్తూన్న దేశపు అత్యన్నత న్యాస్థానం (సుప్రీం కోర్టు) ఇటీవల అదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు తాజా ఆదేశాలు నేటి (మే 4, 2012) నుండి అమలులోకి రానున్నాయి.

ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేసి పరిమితులకు మించి టింట్ చేయబడి ఉన్నట్లయితే జరిమానా విధంచడమే కాకుండా ఆన్‌-ది-స్పాట్‌లోనే టింట్‌/సన్‌ఫిల్మ్‌లను పోలీసులు తొలగించనున్నారు. కార్లకు నల్లటి అద్దాలు ఉపయోగించి కిడ్నాప్‌లు, అక్రమాలు, అత్యాచారాలు వంటి సంఘ విద్రోహ కార్యకలాపాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

మోటార్ వాహన చట్టం ప్రకారం, కారు విండ్‌స్క్రీన్స్ (ముందు వైపు అద్దం), రియర్ విండో (వెనుక వైపు అద్దం) లపై 70 శాతం విజువల్ లైట్ ట్రాన్స్‌మిషన్ (విఎల్‌టి)ను, కారుకు పక్కల ఉండే అద్దాలకు (కారు డోర్లకు అమర్చిన అద్దాలు) 50 విఎల్‌టిని కలిగి ఉండాలి. సాధారణంగా కంపెనీలు తయారు చేసే అద్దాలు (ఫ్యాక్టరీ ఫిట్టెడ్ గ్లాసెస్) ఈ నియమాన్ని పాటించే తయారు చేయటం జరుగుతుంది.

అయితే, కొనుగోలుదారులు తమ సౌకర్యం కోసం బయటి మార్కెట్లలో నలుపు రంగు సన్‌ఫిల్మ్‌లను కొనుగోలు చేసి అమర్చుకోవటం జరుగుతుంది. ఇది చట్ట వ్యతిరేకమైనది. ఇకపై ఎవరైనా నలుపు రంగు సన్‌ఫిల్మ్‌లను రూ.100 నుంచి రూ.500 వరకూ జరిమానా విధించడమే కాకుండా, అలాంటి సన్‌ఫిల్మ్‌లను తక్షణమే తొలగించి వేయటం కూడా జరుగుతుంది.

More from DriveSpark

Article Published On: Friday, May 4, 2012, 14:56 [IST]
English summary
As per the Supreme Court orders, from today (4th May 2012) onwards, one should not use any kind of sun film or tinting on their car windows. According to the motor vehicle rules, a car's windscreen and rear glass should have 70 per cent light transmittance and reflectance, whereas the window panes should have 50 per cent light reflectance.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+