బ్యాట్‌మ్యాన్ సినిమాలో ఎగరనున్న బ్యాట్‌మొబైల్ కారు
బ్యాట్‌మ్యాన్ సిరీస్ సినిమాలకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హాలీవుడ్‌లో అద్భుతమైన గ్రాఫిక్స్, వళ్లు గగుర్పొడిచే సన్నివేశాలతో చిత్రీకరించే ఈ సినిమాల్లో ప్రతి అంశం కూడా ఓ ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అలాగే, ఈ సినిమాల్లో ఉపయోగించే బ్యాట్‌మ్యాన్ కారు (బ్యాట్‌మొబైల్) సినిమా మొత్తానికి హైలైట్‌గై నిలుస్తుంది. అడ్డువచ్చిన ప్రతి వస్తువను బద్దలుకొట్టుకొని మరీ దారిని చేసుకుంటే వెళ్లే బ్యాట్‌మొబైల్ తొలిసారిగా బ్యాట్‌మ్యాన్ బిగిన్స్ అనే చిత్రంలో ఉపయోగించారు.
దీనికి సీక్వెల్‌గా వచ్చిన 'ది డార్క్ నైట్' బ్యాట్‌మొబైల్ కారుతో పాటుగా బ్యాట్‌పాడ్ అనే సూపర్‌బైక్‌ను కూడా ఈ సినిమాలో ఉపయోగించటాన్ని మనం గమనించాం (బ్యాట్‌మొబైల్ కారే బ్యాట్‌పాడ్ టూవీలర్‌గా మారిపోతుంది). కాగా.. ప్రస్తుతం బ్యాట్‌మ్యాన్ సిరీస్‌లో సీక్వెల్‌గా త్వరలో విడుదల సరికొత్త చిత్రం 'ది డార్క్ నైట్ రైజెస్'. ఈ చిత్రంలో కూడా బ్యాట్‌పాడ్, బ్యాట్‌మొబైల్‌ను ఉపయోగించటం జరిగింది.
అయితే, ఇందులో స్పెషల్ ఏంటంటే.. బ్యాట్‌పాడ్ టూవీలర్‌ను క్యాట్‌ఉమెన్ పాత్ర పోషిస్తున్న అన్నే హాత్‌వే రైడ్ చేస్తుంది. అలాగే, బ్యాట్‌మొబైల్ ఫోర్‌వీలర్‌ను బ్యాట్‌మ్యాన్ పాత్ర (బ్రూస్ వేన్) పోషిస్తున్న క్రిస్టియన్ బేల్ డ్రైవ్ చేయనున్నాడు. అంతేకాదు.. ఇప్పటి వరకూ వచ్చిన బ్యాట్‌మ్యాన్ సినిమాల్లో ఈ బ్యాట్‌మొబైల్ కేవలం రోడ్డుపై మాత్రమే వెళ్లేది. కాగా.. కొత్తగా రానున్న ది డార్క్ నైట్ రైజెస్ సినిమాలోని బ్యాట్‌మొబైల్ ఇటు రోడ్డుపై మాత్రమే కాకుండా, అటు గాలిలో కూడా చక్కర్లు కొట్టనుంది.
ఈ సినిమాపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. జులై 19న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియటేర్లను తాకనుంది. ఈ నేపథ్యంలో, లాస్ ఏంజిల్స్ ఇప్పటి నుండే ఐమ్యాక్స్ టికెట్లను విక్రయించటం ప్రారంభించారు. అంటే అర్థం చేసుకోండి ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఎంటో..!! ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా.. నటీనటులు బ్యాట్‌మొబైల్, బ్యాట్‌పాడ్‌లో పలు చోట్ల ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ బ్యాట్‌మొబైల్ 15 అడుగులు పొడవను కలిగి ఉంటుంది. మీరు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారా..?


Click it and Unblock the Notifications








