వేలానికి బిల్ గేట్స్ వాడిన 1979 పోర్షే 911 టర్బో కార్..

మొక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచంలో కెల్లా అత్యంత ధనవంతుడు బిల్ గేట్స్ ఉపయోగించిన కారు ఒకటి ప్రస్తుతం వేలానికి వచ్చింది. మొక్రోసాఫ్ట్ సంస్థను స్థాపించిన కొన్ని సంవత్సరాల తర్వాత బిల్ గేట్స్ ఓ 1979 మోడల్ 'పోర్షే 911 టర్బో' కారును కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఈ కారు ఆస్ట్రియాకు చేరింది. ఆస్ట్రియాలోని వియన్నాకు చెందిన వేలం సంస్థ డోరోథియం జూన్ 2వ తేదీన ఈ కారును వేలం వేయనుంది.

బిల్ గేట్స్‌కు హై స్పీడ్ కార్లంటే క్రేజ్ ఎక్కువ, అందులోనూ పోర్షే కార్ బ్రాండ్ మరీ ఇష్టమట. బిల్ గేట్స్‌ను ఈ కారు చిక్కుల్లో పడేసింది. ఈ కారు వల్ల బిల్ గేట్స్ పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్లాల్సి వచ్చిందట. పోర్షే 911 టర్బో కారును మితిమీరిన వేగంతో నడిపినందుకు ఒకే రోజులో మూడు ఛలాన్‌లను జారీ చేయటమే కాకుండా, బిల్ గేట్స్‌ను అరెస్టు చేయటం కూడా జరిగింది.


బిల్ గేట్స్‌ను ఇంత ఇబ్బందులకు గురి చేసిన ఈ కారును మాత్రం, అతను తన వద్దే ఉంచుకున్నాడు. 1990వ దశకంలో బిల్ గేట్స్ ఈ కారును విక్రయించేశాడు. అప్పటి నుండి ఇది ఆస్ట్రియాలో వివిధ పేర్లపై రిజిస్టర్ అవుతూ వచ్చింది. ఈ కారుకు మొదటి యజమాని మాత్రం బిల్ గేట్సే. ఈ కారు యూరోపియన్ యూనియన్‌లో తయారైనప్పటికీ, అమెరికా దేశానికి తగినట్లుగానే ఫీచర్లను కలిగి ఉంటుంది.

ఈ పోర్షే 911 కారును ఇటీవలే అప్‌గ్రేడ్ చేయటం జరిగింది. ఈ కారుకు తొలిసారిగా ఉపయోగించిన ఒరిజినల్ కలర్‌తో పాటుగా రీబిల్డ్ చేయబడిన 3.3 లీటర్ ఎయిర్ కూల్డ్ ఫ్లాట్ సిక్స్ ఇంజన్ వరకూ వివిధ మార్పులు చేసి అప్పటి లుక్ అండ్ ఫీల్‌ను అలానే ఉండేలా తయారు చేయబడింది. ఈ పోర్షే 911 టర్బో కారు బిడ్డింగ్ 15,000 యూరోల నుండి ప్రారంభం అవుతుంది. వేలంలో ఈ కారు సుమారు 39,000 యూరోల నుండి 50,000 యూరోలు (55,500 డాలర్ల నుండి 71,000 డాలర్లకు సమానం) పలుకుతుందని అంచనా.

More from DriveSpark

Article Published On: Wednesday, May 23, 2012, 15:53 [IST]
English summary
Are you looking to buy Bill Gates car? Then this is for you. A 1979 model Porsche 911 Turbo owned by Bill Gates is going to be auctioned off in Vienna, Austria on June 2, 2012. Gates brought this car in 1979. The expected sales price will be between $ 55,000 and $ 71,000.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+