బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్‌పై రూ.7 లక్షల వరకూ డిస్కౌంట్!

జర్మన్ లగ్జరీ కార్ మేకర్ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా అందిస్తున్న 'బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్' సెడాన్‌పై ఏకంగా రూ.7 లక్షల డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ మోడల్‌పై ఒక్కసారిగా ఇంత తగ్గింపును అందించడం వెనుక కారణం ఏంటనుకుంటున్నారా..? బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఈనెల 27న (జులై 27, 2012) సరికొత్త అప్‌గ్రేడెడ్ బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ సెలూన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది.


ఈ నేపథ్యంలో పాత మోడల్ బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ కార్ల స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు కంపెనీ ఈ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, డీజిల్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 320డి బేస్ వేరియంట్ కార్పోరేట్ ఎడిషన్‌ (ధర రూ.25.8 లక్షలు)పై రూ.6 లక్షల డిస్కౌంట్‌ను టాప్ ఎండ్ వేరియంట్ బిఎమ్‌డబ్ల్యూ 320డి డైనమిక్ (ధర రూ.29.3 లక్షలు)పై రూ.3-5 లక్షల డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తుండగా, పెట్రోల్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 330ఐ (ధర రూ.34.4 లక్షలు)పై రూ.6-7 లక్షల డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మొత్తం ఐదు వేరియంట్లలో (320ఐ, 320డి, 330ఐ, 320డి డైనమిక్, 320డి ఎక్స్‌క్లూజివ్) లభిస్తోంది. వీటి ధరలు రూ.24.4 లక్షల నుంచి రూ.32.9 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. త్వరలో మార్కెట్లోకి రానున్న ఫేస్‌లిఫ్టెడ్ 2012 వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ కారులో ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మెరుగైన ఫీచర్లు సైతం ఉండనున్నాయి. తక్కువ ధరకే బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదే అదునైన సమయం. మరి ఆలస్యం ఎందుకు..? స్టాక్ ముగియక ముందే మీ కలల కారును సొంతం చేసుకోండి.

More from DriveSpark

Article Published On: Thursday, July 19, 2012, 13:05 [IST]
English summary
Those who have been looking to own a beamer but let down by its high price, this opportunity could be for you. The German carmaker is offering exciting discounts of up to Rs 7 lakh on the outgoing (E90) 3 series.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+