రాష్ట్ర మార్కెట్లో మినీ షోరూమ్‌ను ప్రారంభించిన బిఎమ్‌డబ్ల్యూ
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూకు చెందిన ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ 'మినీ' ఇప్పుడు రాష్ట్ర మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పో ఇండియన్ ఎంట్రీ ఇచ్చిన మినీ తొలుత ఢిల్లీలోను ఆ తర్వాత ముంబైలోను షోరూమ్‌లను ప్రారంభించింది. కాగా.. ఇప్పుడు తాజాగా హైదారాబాద్‌లో కూడా మినీ తమ కొత్త షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. మినీ ఇండియాకు హైదరాబాద్ షోరూమ్ దక్షిణభారతదేశంలో మొట్టమొదటిది. హైదరాబాద్‌లో మినీ కార్లకు కున్ మినీ ఎక్స్‌క్లూజివ్ అధీకృత డీలర్‌గా వ్యవహరించనుంది.
ప్రస్తుతం మినీ ఇండియా రాష్ట్ర మార్కెట్లో మూడు మోడళ్లను (మినీ కూపర్, మినీ కన్వర్టిబల్, మినీ కంట్రీమ్యాన్) ఆఫర్ చేస్తోంది. వీటి ధరలు ఇలా ఉన్నాయి:
* మినీ కూపర్ - రూ.25.50 లక్షలు
* మినీ కూపర్ ఎస్ - రూ.28.60 లక్షలు
* మినీ కన్వర్టబల్ - రూ.30.70 లక్షలు
* మినీ కంట్రీమ్యాన్- రూ.32.80 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

హైదరాబాద్‌లో మినీ షోరూమ్

హైదరాబాద్‌లో మినీ షోరూమ్

మినీ కూపర్

మినీ కన్వర్టిబల్

మినీ కంట్రీమ్యాన్

మినీ కంట్రీమ్యాన్

మినీ కన్వర్టిబల్

మినీ కన్వర్టిబల్

మినీ కన్వర్టిబల్

మినీ కన్వర్టిబల్

మినీ కూపర్

మినీ కూపర్

మినీ కూపర్

మినీ కంట్రీమ్యాన్

మినీ కంట్రీమ్యాన్
ఈ సందర్భంగా బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు ఫిలిప్ వోన్ సర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత లగ్జరీ కార్ మార్కెట్లో సాలీనా 30,000 లగ్జరీ కార్లు అమ్ముడుపోతున్నాయని, అయితే ఈ సంవత్సరం ఈ వృద్ధి స్థిరంగా ఉండే అవకాశం ఉందని అన్నారు. మినీ బ్రాండ్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకూ 280 కార్లను విక్రయించామని, ఈ నెలాఖరు నాటికి మరో 20 కార్లను విక్రయించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
మినీ బ్రాండ్‌ను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, అయితే వీటిని ఇండియాలో ఉత్పత్తి చేసే ఆలోచన ప్రస్తుతానికి లేదని ఫిలిప్ తెలిపారు. బిఎమ్‌డబ్ల్యూ తమ మినీ బ్రాండ్ కార్లను సిబియూ రూట్లో (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) దిగుమతి చేసుకుని దేశీయ విపణిలో విక్రయిస్తుంది. మినీ ఇండియాకు ప్రస్తుతం భారత్‌లో నాలుగు షోరూమ్‌లు (రెండు ఢిల్లీలో, ఒకటి ముంబైలో, మరొకటి హైదరాబాద్‌లో) ఉన్నాయి. కాగా.. 2014 నాటికి ఈ షోరూమ్‌ల సంఖ్యను 8కి పెంచాలని, అలాగే ప్రస్తుతం 33గా ఉన్న బిఎమ్‌డబ్ల్యూ షోరూమ్‌ల సంఖ్యను 2014 నాటికి 50కి పెంచాలనే లక్ష్యంతో ఉన్నామని ఫిలప్ చెప్పారు.


Click it and Unblock the Notifications








