నవంబర్ 22న మార్కెట్లోకి రానున్న బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ నుంచి మరో లగ్జరీ కారు మార్కెట్లోకి రానుంది తాజాగా 6-సిరీస్ కారును దేశీయ విపణిలో విడుదల చేసిన బిఎమ్‌డబ్ల్యూ ఇండియా, ఇప్పుడు నవంబర్ 22, 2012న తమ సరికొత్త ఎక్స్6 క్రాసోవర్‌ను కూడా విడుదల చేయనుంది. ఇది బిఎమ్‌డబ్ల్యూ అందిస్తున్న ఎక్స్5 క్రాసోవర్ కన్నా పెద్దగా ఉండనుంది. 2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 క్రాసోవర్‌ను 5-సిరీస్ సెడాన్ మరియు ఎక్స్5 క్రాసోవర్‌ల కలయికతో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

కొత్త 2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 క్రాసోవర్ అడాప్టివ్ ఎల్ఈడి టెక్నాలజీతో కూడిన కొత్త హెడ్‌లైట్లను కలిగి ఉంటుంది. ఇందులో రీడిజైన్ చేయబడిన కొత్త బంపర్స్, కొత్త ఫాగ్ ల్యాంప్స్, సరికొత్త ఫ్రంట్ గ్రిల్ డిజైన్, కొత్త ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ డిజైన్ వంటి మార్పులను గమనించవచ్చు. మరి లేటెందుకు.. కొత్త 2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 కారుపై ఓ లుక్కేయండి..!

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 - డిజైన్

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 - డిజైన్

ఆటోమొబైల్ సెగ్మెంట్లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 విడుదల ద్వారా స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్ (ఎస్ఏవి) అనే కొత్త విభాగాన్ని కంపెనీ సృష్టించనుంది. ఈ కారును ముందు వైపు నుంచి గమనిస్తే ఎస్‌యూవీ లాంటి లుక్‌ను, వెనుక వైపు గమనిస్తే కూపే లాంటి ఫీల్‌ను కలుగుతుంది.

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 - ఇంటీరియర్

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 - ఇంటీరియర్

2013 వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ఇంటీరియర్స్‌లో కంపెనీ పెద్దగా చెప్పుకోదగిన మార్పులు ఏవీ చేయలేదు. అయితే, కొత్త రంగుల కలయికను ఎంచుకునే అవకాశం ఉండవచ్చు.

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 - ధర

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 - ధర

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎక్స్6 డీజిల్ వేరియంట్ (ఎక్స్6 ఎక్స్‌‌డ్రైవ్ 370డి) ధర రూ.68.70 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. అలాగే, పెట్రోల్ వేరియంట్ ఎక్స్6 ఎక్స్‌‌డ్రైవ్ 501 ధర రూ.85.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కాగా.. కొత్తగా మార్కెట్లోకి రానున్న 2013 వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ధర పై ధరల కన్నా కాస్తంత అధికంగా ఉండే ఆస్కారం ఉంది.

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 - ఇంజన్

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 - ఇంజన్

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6లో ఇంజన్ పరంగా ఎలాంటి సాంకేతి మార్పులు ఉండబోవు. ఇదివరకటి ఎక్స్6లో ఉపయోగించిన ఇంజన్లనే కంపెనీ తమ కొత్త 2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6లోను ఉపయోగించనుంది.

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 - ఎమ్50డి

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 - ఎమ్50డి

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6లో కంపెనీ ఓ పవర్‌ఫుల్ వేరియంట్ ఎమ్50డిను విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో పవర్‌ఫుల్ 3-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది గరిష్టంగా 381 బిహెచ్‌పిల శక్తిని, 740 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, November 20, 2012, 18:58 [IST]
English summary
BMW India continues its aggressive new product launch plans with the upcoming launch of the new 2013 X6 crossover. The German premium car leader will launch the new X6 in India on November 22 within a month of launching the 6-Series Gran Coupe.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+