వేలానికి బోల్ట్ గోల్డ్ నిస్సాన్ జిటి-ఆర్ స్పోర్ట్స్ కారు
చిరుత వేగంతో పరుగులు తీసే అథ్లెటిక్ క్రీడాకారుడు హుస్సేన్ బోల్ట్ గురించి మనకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఇటీవల జరిగిన లండన్ ఒలంపిక్ క్రీడల్లో కూడా తన అలుపులేని పరుగుతో స్వర్ణ పతకాన్ని ఎగరేసుకుపోయిన బోల్ట్ 'వేగం' నుంచి స్ఫూర్తి పొంది, ప్రముఖ జర్మన్ కార్ కంపెనీ నిస్సాన్ తయారు చేసిన ఒకే ఒక్క కారు 'నిస్సాన్ బోల్డ్ గోల్డ్ జిటి-ఆర్'ను ఇప్పుడు వేలం వేయనున్నారు. జమైకాకు చెందిన హుస్సేన్ బోల్డ్ నిర్వహిస్తున్న తన ఛారిటీ కోసం ఈ కారును వేలం వేయనున్నారు.
ఈ ఒక్కగానొక్క నిస్సాన్ బోల్ట్ గోల్డ్ జిటిఆర్ కారును నవంబర్ 22, 2012 నుంచి డిసెంబర్ 2, 2012 మధ్య కాలంలో, ప్రముఖ ఆన్‌లైప్ షాపింగ్ కంపెనీ ఈబేలో వేలం వేయనున్నారు. ఈ వేలం ద్వారా వచ్చే నిధులను హుస్సేన్ బోల్డ్ ఫౌండేషన్ ఛారిటీ ఆధ్వర్యంలో, జమైకాలోని పిల్లల చదువు, అభివృద్ధి కార్యకలాపాల కోసం వినియోగిస్తారు. ఛారిటీ కోసం జరుగుతున్న ఈ వేలంలో సువర్ణ వర్ణపు కారు మంచి వెల పలకవచ్చని తెలుస్తోంది. ఈ గోల్డ్ కలర్ నిస్సాన్ జిటి-ఆర్ స్పోర్ట్స్ కారుపై హుస్సేన్ బోల్డ్ సంతకం ఉంటుంది. నిస్సాన్ ఈ స్పోర్ట్స్ కారును రోడ్డు నిబంధనలు అనుకూలంగా తీర్చిదిద్దింది. బిడ్‌లో ఈ కారును గెలుచుకున్న వారికి మార్చి 2013లో ఈ కారును బహుకరిస్తారు.

బోల్ట్ గోల్డ్ నిస్సాన్ జిటి-ఆర్

బోల్ట్ గోల్డ్ నిస్సాన్ జిటి-ఆర్

బోల్ట్ గోల్డ్ నిస్సాన్ జిటి-ఆర్

బోల్ట్ గోల్డ్ నిస్సాన్ జిటి-ఆర్

బోల్ట్ గోల్డ్ నిస్సాన్ జిటి-ఆర్

బోల్ట్ గోల్డ్ నిస్సాన్ జిటి-ఆర్

బోల్ట్ గోల్డ్ నిస్సాన్ జిటి-ఆర్

బోల్ట్ గోల్డ్ నిస్సాన్ జిటి-ఆర్

బోల్ట్ గోల్డ్ నిస్సాన్ జిటి-ఆర్

బోల్ట్ గోల్డ్ నిస్సాన్ జిటి-ఆర్

బోల్ట్ గోల్డ్ నిస్సాన్ జిటి-ఆర్



Click it and Unblock the Notifications








