జులై 14న బ్రెజిల్‌లో విడుదల కానున్న ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌

ఆటో ప్రియులంతా ఫోర్డ్ మోటార్స్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్) "ఫోర్డ్ ఈకోస్పోర్ట్" విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఫోర్డ్ ఈకోఎస్పోర్ట్ ఎస్‌యూవీ ఈ నెల 14 విడుదల కానుంది. అయితే, ఇది తొలుత బ్రెజిల్ మార్కెట్లో విడుదల కానుంది. వాస్తవానికి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ తొలుత ఇండియన్ మార్కెట్లో విడుదల కావల్సి ఉంది.

గతంలో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్‌ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్‌లో ఆవిష్కరించినప్పుడు ఫోర్డ్ అధికారులు మాట్లాడుతూ... గ్లోబల్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని రూపొందించిన ఈ ఎస్‌యూవీని తొలుత ఇండియన్ మార్కెట్లోనే విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఫోర్డ్ బ్రెజిల్ ఈ కారును జులై 14న తమ మార్కెట్లో అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.


గడచిన ఏప్రిల్ నెలలోనే ఫోర్డ్ మోటార్స్ ప్రొడక్షన్ వెర్షన్ ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీ ఫోటోలను విడుదల చేసింది. అంతేకాకుండా, ఇప్పటికే కొన్ని టెస్ట్ వెహికల్స్‌ను ఇండియన్ రోడ్లపై కంపెనీ ట్రైల్ రన్ నిర్వహిస్తోంది. బ్రెజిల్ మార్కెట్లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ధర 53,490 రష్యన్ రియల్స్‌గా ఉంది. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.14.60 లక్షలు అన్నమాట. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మొదటి బ్యాచ్ బుకింగ్‌లను ఫోర్డ్ బ్రెజిల్ జులై 14, 2012 స్వీకరించనుంది. వాళ్లు ఆరోజును ఈకోస్పోర్ట్ డేగా పిలువనున్నారు.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఇండియన్ వెర్షన్ ధర రూ.7 లక్షల నుంచి ప్రారంభం కావచ్చని అంచనా. తాజా సమాచారం ప్రకారం, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఇండియన్ రోడ్లపై టెస్టింగ్ చేయటం దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. రానున్న పండుగ సీజన్‌‌లో కానీ ఈ ఏడాది చివరి నాటికి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఇండియన్ మార్కెట్లో వాణిజ్య పరంగా అందుబాటులోకి రానుంది. దీనికన్నా ముందే మార్కెట్లో విడుదలైనా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఫోర్డ్ మోటార్స్ తమ ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీని తొలిసారిగా గడచిన జనవరిలో న్యూఢిల్లీలో జరిగిన 11వ అంతర్జాతీయ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీ దాదాపు వంద దేశాల్లో విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. ఆకర్షనీయమైన డిజైన్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మెరుగనైన నాణ్యత మరియు ధృఢత్వాలతో దీన్ని రూపొందించామని ఫోర్డ్ పేర్కొంది.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫోటోల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి:

ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీలో సాధారణ సాంప్రదాయ 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌కు బదులు 1 లీటర్, 3-సిలిండర్ ఈకో బూస్ట్ ఇంజిన్ అమర్చారు. ఇది 118 పిఎస్‌ల శక్తిని, 125 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఫోర్డ్ మోటార్స్ నుండి త్వరలో మార్కెట్లోకి రానున్న "ఈకోస్పోర్ట్" ఎస్‌యూవీని చెన్నైలో ఉన్న ప్లాంటులో ఉత్పత్తి చేయనుంది. దీని ఉత్పత్తి కోసం 14.2 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఫోర్డ్ వెచ్చించనుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 10, 2012, 14:18 [IST]
English summary
Ford Motors has recently unveiled the production version of its global compact SUV EcoSport. Now the company is all set to launch this global model in Brazil. Ford EcoSport will be priced at Russian Real 53490 (about Rs 14.60 lakhs in Indian currency).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+