ముంబైలో అగ్నికి ఆహుతైన మరో టాటా నానో కారు

Tata Nano Catches Fire
టాటా మోటార్స్ అందిస్తున్న ప్రజల మరోకారు టాటా నానో మరోసారి భగ్గుమంది. గతంలో వరుస అగ్ని ప్రమాదాలతో కొనుగోలుదారులను బెంబేలెత్తించిన టాటా నానో మరోసారి వార్తల్లోకెక్కింది. తాజాగా ముంబై నగరంలో ఓ నానో కారు అగ్నికి ఆహుతైంది. ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో నానా కారులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో కారులో ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. అందులో ఒ చిన్న పాప కూడా ఉంది. అయితే, ఈ అగ్ని ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది.

ఆ నివాస ప్రాంతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం, టాటా నానో కారు వెనుక భాగంలో (నానో కారులో ఇంజన్ వెనుక భాగంలో ఉంటుంది) కుడి టైరు వద్ద మంటలు రావటాన్ని గుర్తించిన సెక్యూరిటీ గార్డ్ వెంటనే డ్రైవర్‌ను అప్రమత్తం చేయటంలో వారు కారును వదిలిపెట్టి బయటకు వచ్చేశారు. శనివారం రాత్రి (నవంబర్ 10, 2012) ఈ సంఘటన చోటు చేసుకుంది. మంటలను ఆర్పేందుకు సమీపంలో ఎలాంటి వసతులు లేకపోవటంతో నానో కారు పూర్తిగా దగ్ధమైపోయింది.

గతంలో టాటా నానో కార్లు వరుసగా అగ్నికి ఆహుతి అవుతుండటంతో ఈ కారులో స్టార్టర్ మోటార్‌ను కూడా కంపెనీ పూర్తిగా రీప్లేస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో టాటా మోటార్స్ తమ నానోను మరింత మెరుగ్గా తీర్చిదిద్ది రీట్యూన్ చేయబడిన ఇంజన్, మెరుగైన మైలేజ్, సమర్థవంతమైన సస్పెన్షన్‌లతో పాత ధరకే విడుదల చేసింది. అప్పటి నుంచి టాటా నానో కారులో కానీ ఇంజన్‌లో కానీ మంటలు వచ్చిన సంఘటనలు తలెత్తలేదు. వాస్తవానికి కంపెనీ 2012 టాటా నానో కారును ప్రవేశపెట్టిన తర్వాత అమ్మకాలు కూడా నెమ్మదిగా పుంజుకున్నాయి. కాగా.. తాజాగా అగ్గిలో భుగ్గి అయిన టాటా నానో కారులో మంటలు చెలరేగటానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి దీనిపై కంపెనీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Source: autocarpro.in

More from DriveSpark

Article Published On: Thursday, November 15, 2012, 14:20 [IST]
English summary
Another Tata Nano caught fire in India. According to autocarpro.in report, A Tata Nano car caught fire in the northern suburb of Goregaon in Mumbai on Saturday night (November 10. 2012). According to an eyewitness there were three occupants, including a child in the car at the time of fire incident occurred. No one was injured in the incident.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+