చెవర్లే స్పార్క్: ఓ మంచి ఫ్యామిలీ కార్
అమెరికాకు చెందిన ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ తమ చెవర్లే బ్రాండ్‌లో ఇండియన్ మార్కెట్లో అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ చెవర్లే స్పార్క్‌పై ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తోంది. పెట్రోల్ కార్లకు ప్రాధాన్యత తగ్గిపోతున్న నేటి రోజుల్లో వీటి అమ్మకాలను పెంచుకునేందుకు కార్ కంపెనీ వివిధ స్కీమ్‌లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే, చెవర్లే స్పార్క్‌పై కూడా కంపెనీ ఓ విశిష్టమైన ఆఫర్‌ను అందిస్తుంది.
ఈ సంవత్సరం (2012)లో చెవర్లే స్పార్క్ కారును కొనుగోలు చేసిన 2015 వరకూ నగదు రహిత మెయింటినెన్స్ (క్యాష్‌లెస్ మెయింటినెస్స్)ను పొందవచ్చని కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా.. ఈ బుజ్జి కారు యొక్క ప్రతి టెస్ట్ డ్రైవ్‌కు కూడా అశ్సూర్డ్ బహుమతులను అందిస్తామని చెవర్లే తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. అంతే కాదండోయ్.. చెవర్లే స్పార్క్‌ను టెస్ట్ డ్రైవ్ చేస్తే.. లక్కీ డ్రాలో ఆ కారును ఉచితంగా పొందే అవకాశం కూడా ఉంది. ఈ స్కీమ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, నియమ నిబంధనల కోసం చెవర్లే అధీకృత వెబ్‌సైట్‌ను కానీ లేదా మీ సమీపంలోని చెవర్లే డీలర్‌ను కానీ సంప్రదించవచ్చు.
ఇక 'కాంపాక్ట్ సిటీ కార్'గా చెప్పుకునే చెవర్లే స్పార్క్ విషయానికి వస్తే.. ఇది చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ మంచి ఇంటీరియర్ స్పేస్‌ను కలిగి ఉండి, చిన్న కుటుంబాల వారికి ఓ చక్కటి ఫ్యామిలీ కార్‌గా సరిపోతుంది.
చెవర్లే స్పార్క్‌లో ఉపయోగించిన 995సీసీ నెక్స్ట్-జెన్ స్మార్ట్‌టెక్ ఇంజన్ 5400 ఆర్‌పిఎమ్ వద్ద 63 పిఎస్‌ల శక్తిని, 4200 ఆర్‌పిఎమ్ వద్ద 90.3 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ తక్కువ స్పీడ్‌లలో సైతం ఎక్కువ పవర్, టార్క్‌లను ఉత్పత్తి చేయడంలో సహకరిస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. టాప్ ఎండ్ వేరియంట్ స్పార్క్‌లో అన్ని విండోలు 'పవర్ విండోస్' ఆప్షన్‌తో లభిస్తుంది.
చెవర్లే స్పార్క్ బీజ్ ఇంటీరియర్స్‌తో ఓ ప్రీమియం ఫీల్‌ను ఇస్తుంది. రేడియో, సిడి ప్లేయర్, ఎమ్‌పి3, యూఎస్‌బి, ఆక్స్-ఇన్ కనెక్టివిటీతో కూడిన మ్యూజిక్ సిస్టమ్, సెంటర్ ఏసి వెంట్స్, స్పీడోమీటర్, డిజిటల్ మీటర్లతో ఇంటిగ్రేట్ చేయబడిన సెంటర్ కంట్రోల్ ప్యానెల్ ఇందులో ప్రధాన ఆకర్షనగా నిలువనుంది. చెవర్లే స్పార్క్ మూడు వెర్షన్లలో (1.0, ఎల్ఎస్, ఎల్‌టి) లభిస్తుంది. ఇది ఎల్‌పిజి ఆప్షన్‌తో కూడా మార్కెట్లో దొరుకుతుంది. చెవర్లే స్పార్క్ ప్రారంభ ధర రూ.3,14,184 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మాత్రమే. చెవర్లే స్పార్క్ లీటర్ పెట్రోల్‌కు 18 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








