రిమోట్ కంట్రోల్‌తో నడిచే కారును అభివృద్ధి చేసిన బివైడి
మనం ఇప్పటి వరకూ రిమోట్‌తో నడిచే బొమ్మ కార్లను మాత్రమే చూశాం. ఇకపై నిజమైన కార్లు కూడా రిమోట్ కంట్రోల్‌తో నడవనున్నాయి. అలాగే, ఒకప్పుడు జేమ్స్ బాండ్ సినిమాల్లో కూడా ఇలాంటి రిమోట్ కంట్రోల్డ్ కార్లను చూశాం. అయితే, ఇప్పుడు వీటిని రోడ్లపై కూడా చూడబోతున్నాం. చైనాకు చెందిన ఓ కార్ కంపెనీ ఈ రిమోట్ కంట్రోల్డ్ కారును తయారు చేసింది.
చైనాకు చెందిన కార్ కంపెనీ బివైడి ఇప్పటికే ఎఫ్3 అనే రిమోట్ కంట్రోల్డ్ కారును రూపొందించింది. కాగా.. ఇప్పుడు తాజాగా సు రుయ్ (Su Rui) అనే మరో స్ట్రీట్ లీగల్ రిమోట్ కంట్రోల్డ్ కారును రూపొందించింది. ఈ రిమోట్ కంట్రోల్డ్ కారును రోడ్డుపై నడిపేందుకు చట్టపరమైన అనుమతి కూడా ఉంది. అయితే, రిమోట్ కంట్రోల్ సాయంతో ఈ కారు నిర్ధిష్ట పరిమితులను కలిగి ఉంటుంది.
రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ కారు గంటకు గరిష్టంగా 2 కి.మీ. వేగంతో మాత్రమే పరుగులు తీస్తుంది. అంతేకాదు ఈ రిమోట్ కంట్రోల్‌ను ఆపరేట్ చేసే వ్యక్తి కారు నుంచి పది మీటర్లు (33 అడుగుల) దూరంలో ఉన్నప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది. మరీ పూర్తి ఆటోమేటిక్ కారు కావాలంటే గూగుల్ కార్ లాంటి డ్రైవర్‌లెస్ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఏదేమైనప్పటికీ, రిమోట్ కంట్రోల్‌తో పెద్ద కార్లను ఆపరేట్ చేయడం కూడా ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. అయితే, దీనిని ఆపరేట్ చేయడంలో సరైన నైపుణ్యం, శిక్షణ లేకపోతే భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తుంది. సు రుయ్ కారు విషయానికి వస్తే.. చైనాలో ఇది బడ్జెట్ కారు. ఇది రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.
అందులో ఒకటి 109 హెచ్‌పిల శక్తిని విడుదల చేసే 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజన్, మరొకటి 154 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేసే 1.5 లీటర్ టర్బో ఇంజన్. ఇది సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభ్యమవుతుంది. రిమోట్ కంట్రోల్ వెర్షన్ సు రుయ్ కారు ధర 15,773 డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.8 లక్షలు మాత్రమే.


Click it and Unblock the Notifications









