ఆర్మీ కార్ గెటప్‌లో చెవర్లే బీట్ మోడిఫికేషన్
ఈ కారును చూసి ఇదేదో ఆర్మీ కారు అనుకొనుకుంటే మీరు కారులో కాలేసినట్లే. ఇది నూటికి నూరుపాళ్లు చెవర్లే బీట్ కారే... కాకపోతే ఆర్మీ స్టయిల్‌తో తీర్చిదిద్దిన చెవర్లే బీట్ కారు. అమెరికాకు చెందిన ఎనిమిటీ టూ ఫ్యాషన్ అనే కార్ మోడిఫై కంపెనీ ఈ చెవర్లే బీట్ కారును (అమెరికన్ మార్కెట్లో ఇది చెవర్లే స్పార్క్ పేరుతో అమ్ముడవుతోంది) ఇలా ఆర్మీ స్టయిల్‌తో మోడిఫై చేసింది. అడవిలో కూంబింగ్‌కు వెళ్లేటప్పుడు సైన్యం ధరించే దుస్తుల మాదిరాగనే దీనిని ఎక్స్టీరియర్‌ను పెయింట్ చేశారు. ఈ ఆర్మీ స్టయిల్ చెవర్లే బీట్ విశేషాలేంటో ఓ లుక్కేయండి మరి...!
ఈ చెవర్లే బీట్‌ను ఎనిమీ టూ ఫ్యాషన్స్ అనేక రకాల ఆర్మీ వస్తువులతో కస్టమ్ చేసింది. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగినది దీని ఎక్స్టీరియర్ బాడీ పెయిటింగ్. ఆర్మీలో సైన్యం ధరించే దుస్తుల మాదిరిగానే ఈ కారుకు బాడీ పెయింట్ వేశారు. ఆర్మీ స్టయిల్ చెవర్లే బీట్ ఇంటీరియర్స్‌ను కూడా పురాతన ఆర్మీ మెటీరియల్స్‌తో తయారు చేశారు. ఇందులో ఆర్మీ వాహనాలను తలపించే రెకారో సీటింగ్స్ మరో ప్రత్యేకత.

ఈ చెవర్లే బీట్‌ను ఎనిమీ టూ ఫ్యాషన్స్ అనేక రకాల ఆర్మీ వస్తువులతో కస్టమ్ చేసింది. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగినది దీని ఎక్స్టీరియర్ బాడీ పెయిటింగ్. ఆర్మీలో సైన్యం ధరించే దుస్తుల మాదిరిగానే ఈ కారుకు బాడీ పెయింట్ వేశారు.

బెస్పోక్ బాడీ కిట్, కికర్ ఆడియో సిస్టమ్, ఎల్ఈడి లైట్స్, రూఫ్ రెయిల్స్‌పై లగేజ్‌ను స్టోర్ చేసుకునేందుకు ఏర్పాటు చేసిన క్యారియర్, సరికొత్త అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ ఫెండర్ గార్డ్ వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు.

ఆర్మీ స్టయిల్ చెవర్లే బీట్ ఇంటీరియర్స్‌ను కూడా పురాతన ఆర్మీ మెటీరియల్స్‌తో తయారు చేశారు.

ఇందులో ఆర్మీ వాహనాలను తలపించే రెకారో సీటింగ్స్ మరో ప్రత్యేకత.

వెనామ్ నైట్రౌస్ సిస్టమ్, ఇన్‌జెన్ కోల్డ్ ఎయిర్ ఇన్‌టేక్స్, సూపర్‌ట్రాప్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌మను ఉపయోగించి ఈ కస్టమైజ్డ్ బీట్ పెర్ఫామెన్స్‌ను మెరుగుపరచారు.

చెవర్లే బీట్ ఆర్మీ కారులో 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఫాల్కెన్ టైర్లను ఉపయోగించారు.

రియర్ అండ్ సైడ్ ఫెండర్ గార్డ్స్, రియర్ విండో ప్రొటెక్షన్ షీల్డ్ వంటి మార్పులను ఈ ఫోటోలో గమనించవచ్చు.
బెస్పోక్ బాడీ కిట్, కికర్ ఆడియో సిస్టమ్, ఎల్ఈడి లైట్స్, రూఫ్ రెయిల్స్‌పై లగేజ్‌ను స్టోర్ చేసుకునేందుకు ఏర్పాటు చేసిన క్యారియర్, సరికొత్త అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ ఫెండర్ గార్డ్ వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు. వెనామ్ నైట్రౌస్ సిస్టమ్, ఇన్‌జెన్ కోల్డ్ ఎయిర్ ఇన్‌టేక్స్, సూపర్‌ట్రాప్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌మను ఉపయోగించి ఈ కస్టమైజ్డ్ బీట్ పెర్ఫామెన్స్‌ను మెరుగుపరచారు. చెవర్లే బీట్ ఆర్మీ కారులో 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఫాల్కెన్ టైర్లను ఉపయోగించారు. రియర్ అండ్ సైడ్ ఫెండర్ గార్డ్స్, రియర్ విండో ప్రొటెక్షన్ షీల్డ్ వంటి మార్పులను ఈ ఫోటోలో గమనించవచ్చు.


Click it and Unblock the Notifications








