చెవర్లే సెయిల్ సెడాన్: డ్రైవ్‌స్పార్క్ ఎక్స్‌క్లూజివ్ 'స్పై షాట్స్'
జనరల్ మోటార్స్ తాజాగా ప్రవేశపెట్టిన చెవర్లే సెయిల్ యూ-వీఏ హ్యాచ్‌బ్యాక్ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ అభివృద్ధి చేసిన చెవర్లే సెయిల్ సెడాన్ విడుదలకు ముస్తాబవుతోంది. కంపెనీ ఇప్పటికే ఈ కారును వివిధ భారతీయ రోడ్లపై టెస్టింగ్ నిర్వహిస్తోంది. తాజాగా బెంగుళురులో ఈ కారును టెస్టింగ్ చేస్తోండగా మా పాఠకుడు డెన్వర్ డిసౌజా తీసిన ఫోటోలను క్రింది ఫోటో ఫీచర్‌లో గమనించవచ్చు. ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, టొయోటా ఎతియోస్, త్వరలో రానున్న హోండా అమేజ్ వంటి సెడాన్లకు పోటీగా చెవర్లే సెయిల్ సెడాన్ నిలువనుంది.
చెవర్లే సెయిల్ యూ-వీఏ హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించిన ఇంజన్లనే ఈ సెడాన్ వెర్షన్‌లోను ఉపయోగించనున్నారు. పెట్రోల్ వెర్షన్ సెయిల్‌లో అమర్చిన 1199సీసీ, 4-సిలిండర్ ఇంజన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద 86 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 4400 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ వెర్షన్ సెయిల్‌లో అమర్చిన 1248సీసీ, 4-సిలిండర్ టర్బో-డీజెల్ ఇంజన్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 78 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 205 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తాయి. ప్రస్తుతానికి ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ అందుబాటులో లేదు.

చెవర్లే సెయిల్ సెడాన్ - స్పై షాట్స్
జనరల్ మోటార్స్ తాజాగా ప్రవేశపెట్టిన చెవర్లే సెయిల్ యూ-వీఏ హ్యాచ్‌బ్యాక్ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ అభివృద్ధి చేసిన చెవర్లే సెయిల్ సెడాన్ విడుదలకు ముస్తాబవుతోంది. కంపెనీ ఇప్పటికే ఈ కారును వివిధ భారతీయ రోడ్లపై టెస్టింగ్ నిర్వహిస్తోంది.

చెవర్లే సెయిల్ సెడాన్ - స్పై షాట్స్
బెంగుళూరులో ఈ కారును టెస్టింగ్ చేస్తోండగా మా పాఠకుడు డెన్వర్ డిసౌజా తీసిన ఫోటోలను ఈ ఫోటో ఫీచర్‌లో గమనించవచ్చు.

చెవర్లే సెయిల్ సెడాన్ - ఇంజన్స్
చెవర్లే సెయిల్ యూ-వీఏ హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించిన ఇంజన్లనే ఈ సెడాన్ వెర్షన్‌లోను ఉపయోగించనున్నారు. పెట్రోల్ వెర్షన్ సెయిల్‌లో అమర్చిన 1199సీసీ, 4-సిలిండర్ ఇంజన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద 86 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 4400 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ వెర్షన్ సెయిల్‌లో అమర్చిన 1248సీసీ, 4-సిలిండర్ టర్బో-డీజెల్ ఇంజన్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 78 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 205 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తాయి. ప్రస్తుతానికి ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ అందుబాటులో లేదు.

చెవర్లే సెయిల్ సెడాన్ - కాంపిటీషన్
ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, టొయోటా ఎతియోస్, త్వరలో రానున్న హోండా అమేజ్ వంటి సెడాన్లకు పోటీగా చెవర్లే సెయిల్ సెడాన్ నిలువనుంది.

చెవర్లే సెయిల్ సెడాన్ - విడుదల
చెవర్లే సెయిల్ సెడాన్ వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం నాటికి మార్కెట్లోకి రావచ్చని అంచనా.

Click it and Unblock the Notifications