క్రాష్ టెస్ట్‌లో డస్టర్‌కు కేవలం 3-స్టార్ రేటింగ్ మాత్రమే..
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా తాజాగా భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన పవర్‌ఫుల్ ఎస్‌యూవీ డస్టర్ యూరోపియన్ మార్కెట్లలో రెనోకు చెందిన డాసియా బ్రాండ్ క్రింద విక్రయించబడుతున్న సంగతి తెలిసిందే. కాగా.. యూరో ఎన్‌సిఏపి సిరీస్ క్రాష్ టెస్ట్‌లో ఈ కొత్త డస్టర్ కేవలం 3-స్టార్ రేటింగ్‌ను మాత్రమే సంపాధించుకుంది. ఈ క్రాష్ టెస్ట్‌లో మొత్తం ఐదు స్టార్లు ఉంటాయి.
సాధారణంగా ఏ కారైనా ఈ క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్‌ను తెచ్చుకుందంటే అది అన్ని విధాల సురక్షితమైన కారని, అందులో ప్రయాణికులకు పూర్తిస్థాయి రక్షణ ఉంటుందని అర్థం. ఈ క్రాష్ టెస్ట్‌కు దాదాపుగా అన్ని భద్రతా ఫీచర్లు కలిగిన టాప్ ఎండ్ వేరియంట్లను మాత్రమే ఉపయోగిస్తారు. ఇందులో తక్కువ రేటింగ్ వచ్చిన కార్లను భద్రత ఫీచర్ల పరంగా బలహీమైనవిగా పరిగణిస్తారు.

రెనో డస్టర్ ఎస్‌యూవీలో ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), బ్రేక్ అసిస్ట్ వంటి సురక్షితమైన భద్రతా ఫీచర్లు ఉన్నప్పటికీ యూరో ఎన్‌సిఏపి సిరీస్ క్రాష్ టెస్ట్‌లో కేవలం 3-స్టార్ రేటింగ్ మాత్రమే రావటం గమనార్హం. ఏదేమైనప్పటికీ, ఇండియన్ మార్కెట్లో రెనో డస్టర్ ఎస్‌యూవీ అశేషమైన ఆదరణ లభిస్తోంది. ఇండియాలో ఇప్పటికే ఈ కారుకు సుమారు 10,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చి పడ్డాయి.
ప్రస్తుతం, భారత మార్కెట్లో రెనో డస్టర్ ఎస్‌యూవీ ధరలు రూ. 8.19 లక్షల నుంచి రూ. 11.29 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నాయి. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్ రెనో డస్టర్ 102 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 1.6లీటర్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. డీజిల్ వెర్షన్ రెనో డస్టర్ రెండు విభిన్న శక్తులను విడుదల చేసే (85పిఎస్, 110పిఎస్‌ల పవర్) 1.5 డిసిఐ ఇంజన్‌ను కలిగి ఉంటుంది.
సాధారణంగా, ఈ క్రాష్ టెస్టుకు ఉపయోగించే కారును కారును ఆటోమేటిక్‌గా నడిచేలా చేసి ఒక నిర్ధిష్ట వేగం వద్ద బలమైన ఇనుప దిమ్మెకు గుద్దుకునేలా చేసి, ఆ తర్వాత కారులో జరిగే పరిణామాలను అంచనా వేస్తారు. ఇందులో ప్రయాణికులకు సున్నితమైన బొమ్మలను ఉపయోగిస్తారు. బొమ్మలకు తగిలే దెబ్బలను బట్టి ప్రమాద తీవ్రతను అంచనా వేస్తారు. ఎంత మేర రక్షణ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్‌లు సరైన సమయంలో విచ్చుకున్నాయా లేదా, సేఫ్టీ సెన్సార్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా వంటి పలు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సర్టిఫై చేయటం జరుగుతుంది.


Click it and Unblock the Notifications








