మూడు కొత్త రూపాల్లో మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి
దేశపు అగ్రగామి కార్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) ఇటీవల దేశీయ విపణిలో విడుదల చేసిన సక్సెస్‌ఫుల్ ఎమ్‌పివి ఎర్టిగా, ఇండోనేషియన్ మార్కెట్లో మూడు కొత్త రూపాల్లో (లగ్జరీ, స్పోర్టీ, క్రాసోవర్) దర్శనమివ్వనుంది. మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిని విదేశాలకు ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ పేర్కొన్న సంగతి తెలిసిందే.
గ్లోబల్ మార్కెట్ కోసం మార్కెట్ కోసం మూడు సరికొత్త రూపాల్లో ఎర్టిగా (క్రాసోవర్, లగ్జరీ, స్పోర్టీ)

ఎర్టిగా క్రాసోవర్ ఫ్రంట్ వ్యూ

ఎర్టిగా క్రాసోవర్ ఇంటీరియర్ వ్యూ

ఎర్టిగా క్రాసోవర్ రియర్ వ్యూ

ఎర్టిగా లగ్జరీ ఫ్రంట్ వ్యూ

ఎర్టిగా లగ్జరీ ఇంటీరియర్ వ్యూ

ఎర్టిగా లగ్జరీ రియర్ వ్యూ

ఎర్టిగా స్పోర్టీ ఫ్రంట్ వ్యూ

ఎర్టిగా స్పోర్టీ రియర్ వ్యూ

ఎర్టిగా స్పోర్టీ సైడ్ వ్యూ
ఈ నేపథ్యంలో, తాజాగా ఇండోనేషియన్ మార్కెట్ కోసం అక్కడి వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దిన సరికొత్త ఎర్టిగా అక్కడ జరుగుతున్న 2012 ఇండోనేషియన్ అంతర్జాతీయ మోటార్‌షోలో కంపెనీ ఆవిష్కరించింది. లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఆప్షన్‌తో కూడిన ఈ ఎర్టిగా ఎమ్‌పివిలో కె సిరీస్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇందులో అమర్చిన కె14బి 1.4 లీటర్ ఇంజన్ గరిష్టంగా 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 95 పిఎస్‌ల శక్తిని, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 130 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభ్యం కానుంది.
విలాసవంతమైన ఎర్టిగాను కోరుకునే వారికో లగ్జరీ వేరియంట్‌ను, పవర్‌ఫుల్ పెర్ఫామెన్స్, స్పోర్టీ లుక్ ఎర్టిగా కోరుకునే వారి కోసం స్పోర్టీ వేరియంట్‌ను అలాగే ఇటు సెడాన్ లాంటి డ్రైవబిలిటీ అటు ఎమ్‌పివి లాంటి ఫ్లెక్సిబిలిటీని కోరుకునే కస్టమర్ల కోసం క్రాసోవర్ వేరియంట్ ఎర్టిగాను కంపెనీ అభివృద్ధి చేసింది. ప్రతి వేరియంట్ కూడా విభిన్నమైన ఫ్రంట్, డిజైన్, విభిన్న వీల్ డిజైన్, క్రాసోవర్, స్పోర్టీ వేరియంట్లలో డేటైమ్ రన్నింగ్ లైట్స్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
Images: PaulTan


Click it and Unblock the Notifications








