మా నాన్న మారుతి కనిపించడం లేదు
ప్రస్తుత తరం సినిమాల్లో కార్లు కూడా ఓ ప్రత్యేక రోల్‌ను పోషిస్తున్నాయి. కొన్ని సినిమాల్లో అయితే, కేవలం కార్లనే ఆధారంగా చేసుకొని సినిమా తీయటం కూడా జరుగుతుంది. మన తెలుగులో రాజేంద్ర ప్రసాద్ నటించిన 'బామ్మ మాట బంగారు బాట' సినిమాలో సరదా సరదా వింతలు చేసే తమాషా కారు, అలాగే బాలీవుడ్‌లో తనను చంపిన వారి పట్ల పగతీర్చుకునే "టార్జాన్ ది వండర్ కార్", ఇక హాలీవుడ్‌లో అయితే లెక్కలేననీ కార్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.
మరోవైపు బాలీవుడ్‌లో ఫెరారీ కార్ కాన్సెప్ట్‌తో 'ఫెరారీ కా సవారీ' అనే మరో చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా మారుతి సుజుకి ఇండియా కొత్త మార్కెట్లోకి తీసుకువచ్చిన ఎర్టిగా ఎమ్‌పివీతో మరో కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. 'మిస్సింగ్ మేరే డాడ్ కి మారుతి' (మా నాన్న మారుతి కనిపించడం లేదు) అనే పేరుతో నిర్మితిమవుతున్న ఈ చిత్రం పూర్తిగా వినోదాలను పంచనుంది. యష్ రాజ్ ఫిలింస్‌కు చెందిన 'వై-ఫిల్మ్స్' బ్యానర్‌లో అషీమా చిబ్బర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటుంది.
ఛంఢీఘడ్‌లో జరిగే ఓ పంజాబీ పెల్లి నేపథ్యంలో ఈ సినిమా కొనసాగనుంది. ఇందులో కథానాయకుడు సాక్విబ్ సలీమ్ (ముజ్‌సే ఫ్రాండ్‌షిప్ కరోగే సినిమా హీరో) ఓ కాలేజ్ అమ్మాయిని ప్రేమలో పడేసేందుకు తండ్రి కొనుగోలు చేసిన ఓ సరికొత్త మారుతి బ్రాండ్ కారును దొంగిలించి, ఆ తర్వాత డ్రైవింగ్‌లో ఎలాంటి చిక్కుల్లో పడ్డాడనే దానిపై సినిమా సాగుతుంది. మొత్తమ్మీద ఈ సినిమాతో మారుతి సుజుకి ఎర్టిగా కారుకు ఫ్రీ పబ్లిసిటీ లభించనుంది.
ఇక ఎర్టిగా ఎమ్‌పివీ విషయానికి వస్తే.. మారుతి సుజుకి ఇండియా రూపొంగించిన మొట్టమొదటి బహుళ ప్రయోజన వాహనం (ఎమ్‌పివి) ఎర్టిగా. హైదరాబాద్ మార్కెట్లో ఎర్టిగా ఎమ్‌పివి ధరలు రూ.6.16 లక్షల నుండి రూ.8.76 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. ఎర్టిగా ఎమ్‌పివి ఏడు ఆకర్షణీయమైన రంగుల్లో ఆరు వేరియంట్లలో (3 పెట్రోల్, 3 డీజిల్) లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ ఎర్టిగా లీటరుకు 16 కి.మీ. మైలేజీని, డీజిల్ వేరియంట్ ఎర్టిదా 20.77 కి.మీ. మైలేజీనిస్తుందని ఆయన వెల్లడించారు. ఇది ఇతర వాహనాలతో పోల్చుకుంటే 40 శాతం అధికమని, దీని తక్కువ బరువు, శక్తివంతమైన ఇంజన్ కారణంగా ఇది మంచి పెర్ఫామెన్స్‌ను అందిస్తుందని రావు తెలిపారు.


Click it and Unblock the Notifications









