అగ్నికి ఆహుతైన మరో ఫెరారీ ఎఫ్ఎఫ్ సూపర్‌కారు

జయ్.. జయ్.. మని వాయి వేగంతో దూసుకువెళ్లే ఫెరారీ కార్లు ఇప్పుడు బర్నింగ్ కార్లుగా వార్తల్లోకి ఎక్కుతున్నాయి. ఫెరారీ అందిస్తున్న 'ఫెరారీ ఎఫ్ఎఫ్' సూపర్ స్పోర్ట్ కార్‌లో తాజాగా మరో కారు మంటల్లో కాలి బూడిదైపోయింది. గతంలో చైనా, జర్మనీలో కూడా ఫెరారీ ఎఫ్ఎఫ్ కారులో మంటలు చెలరేగిన సంఘటనలను ఉన్నాయి. గడచిన ఆదివారం పోలండ్‌లో ఓ ఫెరారీ ఎఫ్ఎఫ్ కారులో ఉన్నట్టుండి మంటలు చెలరేగి నిమిషాల్లోనే ఈ కారు దాదాపుగా కాలిపోయింది.

ఓ ఎరుపు రంగు ఫెరారీ ఎఫ్ఎఫ్ కారు పోలండ్‌లోని పోలిష్ ఏ4 హైవేపై వెళ్తుండగా ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. వేగంగా వెళ్తున్న కారులో ఉన్నట్టు పొగ రావటంతో కారును పక్కకు నిలిపి ఫైర్ స్టేషన్‌కు ఫోన్ చేశానని, ఫైర్ డిపార్ట్‌మెంట్ వాళ్లు వచ్చే కారు ఇంటీరియర్స్‌తో పాటుగా, రూఫ్ పిల్లర్‌తో సహా దాదాపుగా కాలిపోయిందని డ్రైవర్ పేర్కొన్నాడు.


ఉన్నట్టుండి ఫెరారీ ఎఫ్ఎఫ్ కారులో మంటలు చెలరేగడానికి కారణంలో ఫ్యూయెల్ ఇంజక్షన్ సిస్టమ్ కలిగి ఇంజన్ అయి ఉండొచ్చని భావిస్తున్నారు.


ఫెరారీ ఇటీవలే తమ తొలి ఫోర్-వీల్ డ్రైవ్ "ఫెరారీ ఎఫ్ఎఫ్" స్పోర్ట్స్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. భారత్‌లో అమ్ముడవుతుతున్న అత్యంత ఖరీదైన కార్లలో ఫెరారీ ఎఫ్ఎఫ్ కూడా ఒకటి. దేశీయ విపణిలో దీని ధర రూ.3.5 కోట్లు. ఫెరారీ ఎఫ్ఎఫ్ 6-లీటర్ వీ12 ఇంజన్‌తో 660 బిహెచ్‌పిల శక్తిని, 683 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది కేవలం 3.7 సెకండ్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, May 29, 2012, 19:26 [IST]
English summary
World famous super car maker Ferrari's first four-wheel drive car Ferrari FF catches fire in Poland. This is third Ferrari FF wrecked by fire. Earlier one Ferrari FF catches on fire in Germany and another incidence reported from China.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+