కొత్త గ్రాండే పుంటో స్పోర్ట్స్‌ను విడుదల చేసిన ఫియట్

ఇటాలియన్ కార్ మేకర్ ఫియట్ అందిస్తున్న గ్రాండే పుంటో హ్యాచ్‌బ్యాక్‌లో ఓ సరికొత్త వేరియంట్‌ను విడుదల చేయనున్న ఇదివరకటి కథనంలో తెలుగు డ్రైవ్ స్పార్క్ ప్రచురించినట్లుగానే, ఫియట్ నిన్న (మే 18, 2012) '2012 గ్రాండే పుంటో స్పోర్ట్ 90 హెచ్‌పి' వేరియంట్‌ను మార్కట్లోకి విడుదల చేసింది. మహారాష్ట్రలోని పూనేలో ఫియట్ తమ కాఫీ షాప్ ఫియట్ కెఫేను ప్రారంభించిన సందర్భంగా ఈ కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న గ్రాండే పుంటో హ్యాచ్‌బ్యాక్ కన్నా గ్రాండే పుంటో స్పోర్ట్ 90 హెచ్‌పి హ్యాచ్‌బ్యాక్ అత్యంత శక్తివంతమైనదే కాకుండా, మంచి స్పోర్టీ స్టయిల్, స్పోర్టీ పెర్ఫామెన్స్‌ను కలిగి ఉండి ఓ స్పోర్ట్స్ కారును డ్రైవ్ చేస్తున్న అనుభూతిని కల్పిస్తుంది. భారత మార్కెట్లో ఈ కొత్త పుంటో స్పోర్ట్ ధర రూ.7.58 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉంది. దేశంలో డీజిల్ హ్యాచ్‌బ్యాక్‌లలో ఇదే అత్యంత శక్తివంతమైనది.


కొత్త ఫియట్ పుంటో స్పోర్ట్‌లో 1.3 లీటర్ మల్టీ-జెట్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 93 పిఎస్‌ల శక్తిని, 2,000 ఆర్‌పిఎమ్ వద్ద 209 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త వేరియంట్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే.. ఇది లీటర్ డీజిల్‌కు 20.5 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. జియోర్జెట్టో జియుజియారో (Giorgetto Giugiaro) ఫుంటో స్పోర్ట్ కారును డిజైన్ చేశారు.

స్పోర్టీ వీల్ ఆర్చ్, స్టయిలిష్ బాడీ గ్రాఫిక్స్, 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి విశిష్టమైన ఫీచర్లతో రూపొందించిన ఈ కొత్త ఫియట్ గ్రాండే పుంటో స్పోర్ట్ 90 హెచ్‌పి స్పెషల్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్.. ఎక్సోటిక్ రెడ్, బొస్సా నోవా వైట్, హిప్ హాప్ బ్లాక్ అనే మూడు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యమవుతుంది. ఇందులో బ్లూ అండ్ మి టెక్, మై కార్ డిజిటల్ ఇంటర్‌ఫేస్, ఫాలో మి హోమ్ హెడ్‌‌ల్యాంప్స్ వంటి ఇతర సాంకేతిక ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఇది భద్రత పరంగా కూడా పూర్తి సురక్షితమైన ఫీచర్లతో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, May 19, 2012, 12:30 [IST]
English summary
Fiat India has launched the Grande Punto Sport variant at Fiat Caffe, Pune at Rs 7.36 lakhs (ex-showroom Delhi). Fiat Punto has been a car liked by auto enthusiasts for its style, performance and driving dynamics and now, here is the Sport variant with more fuel efficiency and additional features.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+