అబార్త్ బ్రాండ్‌ను ఇండియాకు తీసుకురానున్న ఫియట్

ఫియట్ తమ పెర్ఫామెన్స్ బ్రాండ్ 'అబార్త్'ను 2013లో భారత మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. మెర్సిడెస్ బెంజ్‌కు పెర్ఫామెన్స్ బ్రాండ్ ఏఎమ్‌జి ఎలాగో, ఫియట్‌కు అబార్త్ కూడా అలానే అన్నమాట. ఫియట్, కార్లో అబార్త్ కంపెనీలు రెండూ 1952లో కలిసి పనిచేయటం ప్రారంభించాయి. ఆ తర్వాత 1971లో ఫియట్ ఈ పెర్ఫామెన్స్ కార్ బ్రాండ్‌ను స్వాధీనం చేసుకుంది. అబార్త్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, చిన్న కార్లలో పెద్ద ఇంజన్లను అమర్చి, మరింత వేగంతో పరుగులు పెట్టేలా తీర్చిదిద్దే బ్రాండే ఈ 'అబార్త్'.

ప్రస్తుతం ఫియట్ డీలర్ల వద్ద ఉంటే 'అబార్త్ స్టూడియో'లలో ఈ కార్లు అమ్ముడవుతుంటాయి. అయితే, అబార్త్ బ్రాండ్ కోసం ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌లను కూడా ఏర్పాటు చేసే యోచనలో ఫియట్ ఉంది. భారత్‌లో ప్రారంభంగా ఫియట్ తమ అబార్త్ బ్రాండ్ క్రింద్ 'గ్రాండే పుంటో ఈవో', '500 అబార్త్' మోడళ్లను పరిచయం చేసే ఆస్కారం ఉంది. భారత్ కోసం డీజిల్ వెర్షన్ అబార్త్‌పై కూడా కంపెనీ సన్నాహాలు చేస్తుంది. గ్రాండే పుంటో ఈవోలో 1.4 లీటర్ టర్బో ఛార్జ్‌డ్ ఇంజన్‌ను ఉపయోగించారు.

ఇది గరిష్టంగా 165 బిహెచ్‌పిల శక్తిని, 25.5 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడమ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది కేవలం 8.2 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది ఈ సెగ్మెంట్లోని మినీ కూపర్ వంటి మోడళ్లకు ధీటుగా నిలుస్తుంది. అబార్త్ బ్రాండ్‌ను భారత మార్కెట్లో విడుదల చేయటం ద్వారా తమ బ్రాండ్‌ను మరింత స్థిరపరుచుకోవాలని ఫియట్ యోచిస్తోంది. ఈ కోవలనే తమ ఎస్‌యూవీ బ్రాండ్ జీప్, దాని మాతృ సంస్థ క్రైస్లర్‌లను కూడా భారత మార్కెట్‌కు పరిచయం చేసేందుకు ఫియట్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఫియట్ అబార్త్

ఫియట్ అబార్త్

ఫియట్ అబార్త్: గ్రాండే పుంటో ఈవో

ఫియట్ అబార్త్: గ్రాండే పుంటో ఈవో

ఫియట్ అబార్త్: గ్రాండే పుంటో ఈవో

ఫియట్ అబార్త్: గ్రాండే పుంటో ఈవో

ఫియట్ అబార్త్: గ్రాండే పుంటో ఈవో

ఫియట్ అబార్త్: గ్రాండే పుంటో ఈవో

ఫియట్ అబార్త్: గ్రాండే పుంటో ఈవో

ఫియట్ అబార్త్: గ్రాండే పుంటో ఈవో

ఫియట్ 500 అబార్త్

ఫియట్ 500 అబార్త్

ఫియట్ 500 అబార్త్

ఫియట్ 500 అబార్త్

ఫియట్ 500 అబార్త్

ఫియట్ 500 అబార్త్

ఫియట్ 500 అబార్త్

ఫియట్ 500 అబార్త్

ఫియట్ 500 అబార్త్

ఫియట్ 500 అబార్త్

ఫియట్ 500 అబార్త్ క్యాబ్రియో

ఫియట్ 500 అబార్త్ క్యాబ్రియో

More from DriveSpark

Article Published On: Tuesday, December 11, 2012, 17:40 [IST]
English summary
Italian carmaker Fiat plans to launch its performance car brand Abarth in India in 2013. Initially Fiat likely to bring Grande Punto Evo and possibility the 500 Abarth to India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+