ఫియట్ 500ఎక్స్ క్రాసోవర్‌ను ఆవిష్కరించిన కంపెనీ
ఫియట్ 500 బుజ్జి కారు గుర్తుందా..? ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్ ఒకప్పుడు భారత మార్కెట్లో అందుబాటులో ఉంచిన ప్రీమియం స్మాల్ కారు ఫియట్ 500లో కంపెనీ ఓ కొత్త అవతార్‌ను ఆవిష్కరించింది. ఫియట్ 500 కారుకు ఇండియన్ మార్కెట్లో పెద్ద డిమాండ్ లేదు కానీ గ్లోబల్ మార్కెట్లలో మాత్రం ఈ మోడల్‌కు ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.
అక్కడి మార్కెట్లలో ఫియట్ ఇప్పటికే అనేక రకాల ఫియట్ 500 వేరియంట్లను, స్పెషల్ ఎడిషన్లను విడుదల చేసింది. కాగా.. కంపెనీ ఇప్పుడు తాజాగా, ఫియట్ 500 ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని డిజైన్ క్రాసోవర్ ఫియట్ 500ఎక్స్ ఇటలీలో ఆవిష్కరించింది. ఫియట్ 500ఎక్స్ క్రాసోవర్ 0.9 లీటర్ ట్విన్-ఎయిర్, 1.3 లీటర్ మల్టీజెట్ ఇంజన్లతో ఇది లభ్యం కానుంది.
ఫియట్ 500ఎక్స్ క్రాసోవర్‌ను హ్యాచ్‌బ్యాక్ మరియు ఎస్‌యూవీల ఫీచర్లను జోడించి డిజైన్ చేశారు. ఇది ఫ్రంట్ వీల్, ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఫియట్ 500ఎక్స్ క్రాసోవర్ 500 సిరీస్‌లో ఫియట్ అందిస్తున్న ఐదవ మోడల్. ఈ సిరీస్‌లో 500 త్రీ-డోర్ హ్యాచ్‌బ్యాక్, 500సి కన్వర్టిబల్, 500 అబార్త్, 500ఎల్ ఫైన్-డోర్ మినీ వ్యాన్ వెర్షన్లు లభ్యమవుతున్నాయి. వచ్చే ఏడాది నుంచి ఫియట్ 500ఎక్స్ క్రాసోవర్ ఉత్పత్తి ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications









