తొలి వార్షికోత్సవ ఆఫర్: స్కొడా ర్యాపిడ్‌పై రూ.75,000 బెనిఫిట్స్
చెక్ రిపబ్లిక్‌కు చెందిన కార్ కంపెనీ స్కొడా ఇండియా (ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ అనుబంధ కంపెనీ) అందిస్తున్న ఎంట్రీ లెవల్ సెడాన్ 'స్కొడా ర్యాపిడ్' భారత మార్కెట్లో విడుదలై అప్పుడు ఏడాది పూర్తయిపోయింది. ఈ నేపథ్యంలో, స్కొడా ర్యాపిడ్ సెడాన్ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కంపెనీ ఈ కారును కొనుగోలు చేసే కస్టమర్లు మొత్తం రూ.75,000/- విలువైన ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తోంది.
ఈ ఆఫర్‌లో కలిసి ఉండేవి..
- రూ. 25,000 నగదు తగ్గింపు (క్యాష్ డిస్కౌంట్)
- ఉచిత బీమా (ఫ్రీ ఇన్సూరెన్స్)
- బంపర్ టూ బంపర్ మెయింటినెన్స్ ప్యాకేజ్
- ఉచిత అదనపు 3వ, 4వ సంవత్సరపు వారంటీ

యూరోపియన్ వెర్షన్ స్కొడా ర్యాపిడ్

స్కొడా ర్యాపిడ్

స్కొడా ర్యాపిడ్

స్కొడా ర్యాపిడ్

యూరోపియన్ వెర్షన్ స్కొడా ర్యాపిడ్

స్కొడా ర్యాపిడ్

స్కొడా ర్యాపిడ్
స్కొడా ర్యాపిడ్ పెట్రోల్ వెర్షన్‌లో 1.6 లీటర్, 1598 సీసీ, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 5250 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 3800 ఆర్‌పిఎమ్ వద్ద 153 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. అలాగే, స్కొడా ర్యాపిడ్ డీజిల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.6-లీటర్, 1598 సీసీ, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ 4400 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్ట 104 బిహెచ్‌పిల శక్తిని, 1500-2500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.
స్కొడా ర్యాపిడ్ టాప్-ఎండ్ వేరియంట్ల (ఎలిగాన్స్)లో ఈబిడి (ఎలక్ట్రానికి బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ముందు, వెనుక ఫాగ్ ల్యాంప్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మిర్రర్స్, డ్రైవర్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఎయిర్ కండిషనింగ్, రియర్ ఏసి వెంట్స్, పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, టిల్ట్ స్టీరింగ్, టెలిస్కోపిక్ స్టీరింగ్, రిమోట్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, సిడి/ఎఫ్ఎమ్/ఆక్స్-ఇన్/ఎస్‌డి కార్డ్ ఆప్షన్ కలిగిన మ్యూజిక్ సిస్టమ్, కీ లెస్ ఎంట్రీ, ఫ్యాబ్రిక్ సీట్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి.
స్కొడా ర్యాపిడ్ సెడాన్ గరిష్ట వేగం గంటకు 183 కిలోమీటర్లు. సిల్వర్, వైట్, బీగీ, బ్లాక్, రెడ్ కలర్ ఆప్షన్లతో ఇది లభ్యమవుతుంది. ఫోక్స్‌వ్యాగన్ వెంటో, హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ, మారుతి ఎస్ఎక్స్4, ఫోర్డ్ ఫియస్టా మోడళ్లను సవాల్ చేస్తూ స్కొడా తమ ర్యాపిడ్ సెడాన్‌ను ప్రవేశపెట్టింది. (పై తెలిపిన ఆఫర్ కేవలం పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ మరియు అన్ని డీజిల్ వేరియంట్లపై మాత్రమే లభిస్తుంది).


Click it and Unblock the Notifications








