ఫస్ట్ లుక్: 2013 రెనో ఫ్లూయెన్స్ ప్రీమియం సెడాన్

ఫ్రాన్స్ ఆటో దిగ్గజం రెనో అందిస్తున్న ప్రీమియం సెడాన్ ఫ్లూయెన్స్‌లో ఓ రిఫ్రెష్డ్ వెర్షన్‌ను కంపనీ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న రెనో ఫ్లూయెన్స్‌తో డిజైన్, ఫీచర్స్ పరంగా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండేలా ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2013 రెనో ఫ్లూయెన్స్ ప్రీమియం సెడాన్‌ను కంపెనీ తయారు చేసింది. టర్కీ మోటార్ షోలో రెనో తమ సరికొత్త కారును ప్రదర్శనకు ఉంచనుంది. ఈనేపథ్యంలో 2013 రెనో ఫ్లూయెన్స్ సెడాన్ ఫోటోలను కంపెనీ విడుదల చేసింది. వాటిని క్రింది ఫోటో ఫీచర్‌లో గమనించవచ్చు.

రెనో ఇండియా తొలిసారిగా తమ ప్రీమియం సెడాన్ ఫ్లూయెన్స్ విడుదలతో 2010లో భారత మార్కెట్లోకి ప్రవేశించిద. ఆ తర్వాత పండుగ సీజన్‌లో ఈ కారులో కొన్ని ఫీచర్లను తగ్గించి, దీని ధరను కూడా తగ్గించింది. ఈ ప్రీమియం సెడాన్‌కు మరింత ప్రీమియం లుక్‌నిచ్చేలా 2013 రెనో ఫ్లూయెన్స్ సెడాన్ డిజైన్‌లో కంపెనీ ప్రత్యేక శ్రద్ధలు తీసుకొని డిజైన్ చేయటం జరిగింది. సరికొత్త ఫ్రంట్ లుక్, ప్రీమియం ఇంటీరియర్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, అల్లాయ్ వీల్స్, టచ్‌స్క్రీన్ మల్టీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ వంటి ప్రధాన మార్పులుగా చెప్పుకోవచ్చు.

2013 రెనో ఫ్లూయెన్స్

2013 రెనో ఫ్లూయెన్స్ - ఫ్రంట్ వ్యూ

2013 రెనో ఫ్లూయెన్స్

2013 రెనో ఫ్లూయెన్స్ - రియర్ వ్యూ

2013 రెనో ఫ్లూయెన్స్

2013 రెనో ఫ్లూయెన్స్ - సైడ్ వ్యూ

2013 రెనో ఫ్లూయెన్స్

2013 రెనో ఫ్లూయెన్స్ - ఇంటీరియర్స్

2013 రెనో ఫ్లూయెన్స్

2013 రెనో ఫ్లూయెన్స్ - డేటైమ్ రన్నింగ్ ఎల్ఈడి లైట్స్

2013 రెనో ఫ్లూయెన్స్

2013 రెనో ఫ్లూయెన్స్ - ప్రీమియం ఫ్రంట్ లుక్

2013 రెనో ఫ్లూయెన్స్

2013 రెనో ఫ్లూయెన్స్ - స్టయిలిష్ రియర్ లుక్

2013 రెనో ఫ్లూయెన్స్

2013 రెనో ఫ్లూయెన్స్ - టచ్‌స్క్రీన్ మల్టీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

2013 రెనో ఫ్లూయెన్స్

2013 రెనో ఫ్లూయెన్స్ - 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్


2013 రెనో ఫ్లూయెన్స్ సెడాన్‌లో 1.6 లీటర్ 115 బిహెచ్‌పి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. డీజిల్ వెర్షన్ ఫ్లూయెన్స్‌లో 1.5 లీటర్ 110 బిహెచ్‌పి టర్బో డీజిల్ ఇంజన్‌ను అమర్చారు. ఇవి రెండూ కూడా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తోలభ్యమవుతాయి. వచ్చే ఏడాదిలో కొత్త ఫ్లూయెన్స్ ఇండియన్ మార్కెట్లో విడుదల కావచ్చని సమాచారం. కాగా.. ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న రెనో ఫ్లూయెన్స్ సెడాన్ మూడు వేరియంట్లలో లభిస్తోంది. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

  • రెనో ఫ్లూయెన్స్ డీజిల్ ఈ2 - రూ. 13.74 లక్షలు
  • రెనో ఫ్లూయెన్స్ డీజిల్ ఈ4 - రూ. 15.38 లక్షలు
  • రెనో ఫ్లూయెన్స్ పెట్రోల్ ఈ4 - రూ. 15.45 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

డీజిల్ వెర్షన్ రెనో ఫ్లూయెన్స్‌లో అమర్చిన 1461సీసీ డీజిల్ ఇంజన్‌ గరిష్టంగా 110 పిఎస్‌ల శక్తిని, 240 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటరు డీజిల్‌కు 20.4 కి.మీ. మైలేజీని (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) ఆఫర్ చేస్తుంది. అలాగే, పెట్రోల్ వెర్షన్ రెనో ఫ్లూయెన్స్‌లో అమర్చిన 1997సీసీ పెట్రోల్ ఇంజన్‌ గరిష్టంగా 137 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 13.4 కి.మీ. మైలేజీని (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) ఆఫర్ చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, November 2, 2012, 13:41 [IST]
English summary
French carmaker Renault has revealed its facelift 2013 Fluence sedan pictures. Company will unveil the 2013 Renault Fluence premium sedan at Turky Motor Show. The new Fluence comes with an upgraded petrol engine and a host of new features.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+