బ్రెజిల్‌లో విడుదలైన ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌, బుకింగ్స్ స్టార్ట్

అమెరికన్ ఆటో దిగ్గజం ఫోర్డ్ మోటార్స్ అభివృద్ధి గ్లోబల్ కాంపాక్ట్ ఎస్‌యూవీ "ఫోర్డ్ ఈకోస్పోర్ట్" ప్రస్తుత బ్రెజిల్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. బ్రెజిల్‌లోని ఫోర్డ్ డీలర్లు ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కోసం ముందస్తు బుకింగ్‌‌లను స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోర్డ్ బ్రెజిల్ ఈ మోడల్ ధరలను ప్రకటించింది. అంతేకాకుండా బ్రెజిల్‌లోని సాకర్ ప్లేయర్లతో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కోసం ప్రచార కార్యక్రామాన్ని కూడా కంపెనీ చేపట్టింది.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్ అక్కడి మార్కెట్లో ఈబిఏ3, ఈఎఫ్ఏ3, ఈఎప్‌బి3 అనే మూడు వేరియంట్లలో లభ్యం కానుంది. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
* ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.6 ఈబిఏ3 - బిఆర్ఎల్ 53,490 (రూ.14.47 లక్షలు)
* ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఫ్రీస్టయిల్ 1.6 ఈఎఫ్ఏ3 - బిఆర్ఎల్ 59,990 (రూ.16.22 లక్షలు)
* ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఫ్రీస్టయిల్ 1.6 ఈఎఫ్‌బి3 - బిఆర్ఎల్ 63,690 (రూ.17.22 లక్షలు)


అయితే, ఇండియన్ వెర్షన్ పోర్డ్ ఈకోస్పోర్ట్ ధర మాత్రం ఇంత అధికంగా ఉండే అవకాశం లేదు. మన మార్కెట్లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ధర రూ.7 లక్షల నుంచి ప్రారంభం కావచ్చని అంచనా. ఇండియన్ వెర్షన్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కంపెనీ తాజాగా అభివృద్ధి చేసిన 1 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్‌తో లభ్యం కావచ్చని అంచనా. ఈ ఇంజన్ పరిమాణంలో చిన్నదిగా ఉండి, అధిక పెర్ఫామెన్స్‌ను, ఎక్కువ మైలేజ్‌ను అందిస్తుంది.

బ్రెజిల్ వెర్షన్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ టాప్ ఎండ్ వేరియంట్‌లో బ్లూటూత్ వాయిస్ కమాండ్స్, ఎల్ఈడి లైట్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, బాడీ కలర్డ్ బంపర్స్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ విండోస్, పార్కింగ్ సెన్సార్స్, ట్రిప్ కంప్యూటర్, టిసిఎస్, ఈఎస్‌పి, హిల్ హోల్డ్ ఫంక్షన్, లెథర్ సీట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆగస్టు మొదటి వారంలో ఇది వాణిజ్య పరంగా మార్కెట్లో విడుదల కానుంది.

కాగా.. గడచిన ఏప్రిల్ నెలలో ఫోర్డ్ మోటార్స్ ప్రొడక్షన్ వెర్షన్ ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీ ఫోటోలను విడుదల చేసింది. అంతేకాకుండా, ఇప్పటికే కొన్ని టెస్ట్ వెహికల్స్‌ను ఇండియన్ రోడ్లపై కంపెనీ ట్రైల్ రన్ నిర్వహిస్తోంది. రానున్న పండుగ సీజన్‌‌లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఇండియన్ మార్కెట్లో లభ్యమయ్యే ఆస్కారం ఉంది.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫోటోల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి:

ఇండియన్ వెర్షన్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో సాధారణ సాంప్రదాయ 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌కు బదులు 1 లీటర్, 3-సిలిండర్ ఈకో బూస్ట్ ఇంజిన్ అమర్చారు. ఇది 118 పిఎస్‌ల శక్తిని, 125 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఫోర్డ్ మోటార్స్ నుండి త్వరలో మార్కెట్లోకి రానున్న "ఈకోస్పోర్ట్" ఎస్‌యూవీని చెన్నైలో ఉన్న ప్లాంటులో ఉత్పత్తి చేయనుంది. దీని ఉత్పత్తి కోసం 14.2 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఫోర్డ్ వెచ్చించనుంది.

More from DriveSpark

Article Published On: Monday, July 16, 2012, 11:21 [IST]
English summary
Ford Brazil has already started accepting pre bookings of EcoSport. Company recently unveiled the production version of its global compact SUV EcoSport. Ford EcoSport is priced at BRL 53,490 (about Rs 14.47 lakhs in Indian currency).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+