జనవరిలో విడుదల కానున్న ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ ఎస్‌యూవీ

By Ravi

అమెరికన్ ఆటో దిగ్గజం ఫోర్డ్ మోటార్స్ అభివృద్ధి గ్లోబల్ కాంపాక్ట్ ఎస్‌యూవీ "ఫోర్డ్ ఈకోస్పోర్ట్" భారత మార్కెట్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే బ్రెజిల్ మార్కెట్లోకి ప్రవేశించిన అక్కడి కొనుగోలుదారుల మన్ననలు పొందుతున్న ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ను, కంపెనీ వచ్చే ఏడాది జనవరి నెలలో ఇండియాలో విడుదల చేయనుంది. తాజా సమాచారం ప్రకారం, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

గతంలో ఫోర్డ్ చిన్న కారు ఫిగోను అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి చేతుల మీదుగా కంపెనీ విడుదల చేసిన సంగతి తెలిసినదే. భారత మార్కెట్లో పోర్డ్ ఈకోస్పోర్ట్ ధర రూ.7 లక్షల నుంచి ప్రారంభం కావచ్చని అంచనా. ఇందులో ఫోర్డ్ తాజాగా అభివృద్ధి చేసిన 1 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ఈ ఇంజన్ పరిమాణంలో చిన్నదిగా ఉండి, అధిక పెర్ఫామెన్స్‌ను, ఎక్కువ మైలేజ్‌ను ఆఫర్ చేస్తుంది.

ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌

ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌

ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ - ఫ్రంట్ ప్రొఫైల్

ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ - ఫ్రంట్ ప్రొఫైల్

ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ - రియర్ ప్రొఫైల్

ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ - రియర్ ప్రొఫైల్

ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ - సైడ్ ప్రొఫైల్

ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ - సైడ్ ప్రొఫైల్

ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌

ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌

ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌

ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌

ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌

ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌

ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌

ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌


ఫోర్డ్ మోటార్స్ బ్రెజిల్ మార్కెట్లో విడుదల చేసిన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో బ్లూటూత్ వాయిస్ కమాండ్స్, ఎల్ఈడి లైట్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), బాడీ కలర్డ్ బంపర్స్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ విండోస్, పార్కింగ్ సెన్సార్స్, ట్రిప్ కంప్యూటర్, టిసిఎస్, ఈఎస్‌పి, హిల్ హోల్డ్ ఫంక్షన్, లెథర్ సీట్స్ వంటి సౌకర్యవంతమైన, సురక్షితమైన ఫీచర్లు ఉన్నాయి.

మరిన్ని ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫోటోల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి:

ఇండియన్ వెర్షన్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో సాధారణ సాంప్రదాయ 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌కు బదులు 1 లీటర్, 3-సిలిండర్ ఈకో బూస్ట్ ఇంజిన్ అమర్చారు. ఇది 118 పిఎస్‌ల శక్తిని, 125 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఫోర్డ్ మోటార్స్ నుండి త్వరలో మార్కెట్లోకి రానున్న "ఈకోస్పోర్ట్" ఎస్‌యూవీని చెన్నైలో ఉన్న ప్లాంటులో ఉత్పత్తి చేయనుంది. దీని ఉత్పత్తి కోసం 14.2 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఫోర్డ్ వెచ్చించనుంది.

బ్రెజిల్ మార్కెట్లో విడుదలైన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఈబిఏ3, ఈఎఫ్ఏ3, ఈఎప్‌బి3 అనే మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
* ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.6 ఈబిఏ3 - బిఆర్ఎల్ 53,490 (సుమారు రూ.14.47 లక్షలు)
* ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఫ్రీస్టయిల్ 1.6 ఈఎఫ్ఏ3 - బిఆర్ఎల్ 59,990 (సుమారు రూ.16.22 లక్షలు)
* ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఫ్రీస్టయిల్ 1.6 ఈఎఫ్‌బి3 - బిఆర్ఎల్ 63,690 (సుమారు రూ.17.22 లక్షలు)

More from DriveSpark

Article Published On: Wednesday, November 28, 2012, 11:31 [IST]
English summary
The Ford EcoSport compact SUV is set to be launched in January 2013 an year after it was unveiled at the 2012 Delhi Auto Expo. Ford India officials have confirmed that the EcoSport will be launched in India by Tamil Nadu Chief Minister J Jayalalithaa.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+