ఫోర్-వీల్ డ్రైవ్ సుజుకి స్విఫ్ట్ అవుట్‌డోర్ విడుదల: ఫోటోలు

By Ravi

చిన్న కార్ ప్రియులందరి ఫేవరేట్ కారు స్విఫ్ట్. ఈ కారుపై మనసు పారేసుకోని వారెవరూ ఉండరేమో. లుక్, పవర్, పెర్ఫామెన్స్, మెయింటినెన్స్, మైలేజ్, సర్వీస్ వంటి అనేక విషయాల్లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న సుజుకి స్విఫ్ట్, గ్లోబల్ మార్కెట్లలో స్విఫ్ట్ స్పోర్ట్ రూపంలో లభ్యమవుతున్న సంగతి తెలిసిందే. (ఈ మోడల్ ఇండియాకు రావచ్చనే వార్తలు కూడా ఉన్నాయి). స్విఫ్ట్ స్పోర్ట్ ఇప్పటి వరకూ టూ-వీల్ డ్రైవ్ (4x2, ఫ్రంట్ వీల్ డ్రైవ్) ఆప్షన్‌తో మాత్రమే లభ్యమవుతోంది.

కాగా.. ఇందులో ఫోర్-వీల్ డ్రైవ్ (4x4, ఆల్-వీల్ డ్రైవ్) ఆప్షన్‌తో కూడిన సరికొత్త స్విఫ్ట్ స్పోర్ట్‌ను జపనీస్ సుజుకి మోటార్ కార్పోరేషన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్ స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్‌ అనే పేరుతో కంపెనీ ఈ మోడల్‌ను ఇటీవలే కరెరా, ఇటలీ దేశాల్లో విడుదల చేసింది. మరిన్ని యూరోపియన్, ఏషియన్ మార్కెట్లలో ఈ కొత్త కారును అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. స్విఫ్ట్ స్పోర్ట్‌లో మరింత స్పోర్టీయర్ వెర్షన్ కోరుకునే కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ కారును అభివృద్ధి చేసింది.

సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్‌

సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్‌

జపనీస్ కార్ కంపెనీ సుజుకి మోటార్ కార్పోరేషన్ గ్లోబల్ మార్కెట్లలో అందిస్తున్న స్విఫ్ట్ స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను మరొక కొత్త రూపంలో మార్కెట్‌కు పరిచయంచ చేసింది. స్విఫ్ట్ స్పోర్ట్ ఇప్పటి వరకూ టూ-వీల్ డ్రైవ్ (4x2, ఫ్రంట్ వీల్ డ్రైవ్) ఆప్షన్‌తో మాత్రమే లభ్యమవుతోంది. కాగా.. కంపెనీ ఇందులో తాజాగా ఫోర్-వీల్ డ్రైవ్ (4x4, ఆల్-వీల్ డ్రైవ్) ఆప్షన్‌తో కూడిన సరికొత్త స్విఫ్ట్ స్పోర్ట్‌‌ను విడుదల చేసింది.

సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్‌

సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్‌

సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్‌‌లో పవర్‌ఫుల్ 1.2 లీటర్ వివిటి, ఫోల్ సిలిండర్, పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 94 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన ఈ కారులో ఇంజన్ పవర్‌ను నాలుగు చక్రాలకు సమానంగా బదిలీ చేయబడుతుంది. ఈ ఇంజన్‌ను 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది.

సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్

సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్

సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్ రెండు వేరియంట్లలో (జిఎల్ స్టయిల్, జిఎల్ టాప్) లభ్యమవుతుంది.

సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్‌

సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్‌

* సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్ జిఎల్ స్టయిల్ - 16,616 యూరోలు (మన కరెన్సీలో సుమారు రూ.11.5 లక్షలు)

* సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్ జిఎల్ టార్ - 17,524 యూరోలు (మన కరెన్సీలో సుమారు రూ.12 లక్షలు)

సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్

సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్

సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్ స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్‌ అనే పేరుతో కంపెనీ ఈ మోడల్‌ను ఇటీవలే కరెరా, ఇటలీ దేశాల్లో విడుదల చేసింది. మరిన్ని యూరోపియన్, ఏషియన్ మార్కెట్లలో ఈ కొత్త కారును అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.


సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్‌ స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్ ఫోక్స్‌వ్యాగన్ క్రాస్, ఆడి ఆల్‌రోడ్‌కు అనేక పోలికలు ఉన్నాయి. స్పోర్టీ బంపర్స్, వీల్ ఆర్చెస్, మ్యాట్ బ్లాక్ గ్రిల్, బ్లాక్ అవుట్ పిల్లర్స్ వంటివి ప్రధాన ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు. ఇందులో పవర్‌ఫుల్ 1.2 లీటర్ వివిటి, ఫోల్ సిలిండర్, పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 94 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన ఈ కారులో ఇంజన్ పవర్‌ను నాలుగు చక్రాలకు సమానంగా బదిలీ చేయబడుతుంది. ఈ ఇంజన్‌ను 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్ రెండు వేరియంట్లలో (జిఎల్ స్టయిల్, జిఎల్ టాప్) లభ్యమవుతుంది.

సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్ ఫీచర్లు:

  • ఆల్ పవర్ విండోస్
  • కీలో రిమోట్ కంట్రోల్‌తో కూడిన సెంట్రల్ లాకింగ్
  • మ్యాన్యువల్ ఎయిర్ కండిషనింగ్
  • సిడి ప్లేయర్, ఎమ్‌పి3, యూఎస్‌బి ఆడియోతో కూడిన ఆడియో సిస్టమ్
  • ఎలక్ట్రిక్ వాల్యూమ్ కంట్రోల్స్
  • నాలుగు స్పీకర్లు, రెండు ట్వీటర్లు, ఏంటీనా
  • స్టీరింగ్ వీల్‌పై అమర్చిన ఆడియో కంట్రోల్స్
  • లెథర్ స్టీరింగ్ వీల్
  • డ్రైవర్ ఎత్తుకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే వీలున్న సీట్
  • ఎలక్ట్రోమ్యాగ్నటిక్ టెయిల్ గేట్ ఓపెనింగ్
  • ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్
  • డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ (ప్యాసింజర్, డ్రైవర్)
  • డ్రైవర్ క్నీ (మోకాలు) ఎయిర్‌బ్యాగ్
  • ముందువైపు, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్ (మొత్తం ఏడు)
  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పి)
  • ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (టిసిఎస్)
  • కొలాప్సబల్ పెడల్స్
  • 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్
  • ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
  • ప్రైవసీ గ్లాస్
  • క్రూయిజ్ కంట్రోల్

సుజుకి స్విఫ్ట్ 4x4 ధరలు:

  • సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్ జిఎల్ స్టయిల్ - 16,616 యూరోలు (మన కరెన్సీలో సుమారు రూ.11.5 లక్షలు)
  • సుజుకి స్విఫ్ట్ 4x4 అవుట్‌డోర్ జిఎల్ టార్ - 17,524 యూరోలు (మన కరెన్సీలో సుమారు రూ.12 లక్షలు)

More from DriveSpark

Article Published On: Friday, October 19, 2012, 13:02 [IST]
English summary
Japanese carmaker Suzuki Motor Corporation has has launched their latest Swift 4x4 Outdoor for global markets. Suzuki Swift 4x4 Outdoor sport hatchback is powered by 1.2 liter VVT petrol four cylinder engine which is capable of producing 94 hp transmitted to its four wheels through a six speed transmission.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+