చెవర్లే సెయిల్ చిన్న కారు విడుదలకు ముహుర్తం ఖరారు

"క్యూ3 (మూడవ త్రైమాసికం)లో మేము సెయిల్‌ను విడుదల చేయనున్నాం. చిన్న కారు సెగ్మెంట్‌తో పాటుగా బహుళ ప్రయోజన వాహనాల (ఎమ్‌పివి) విభాగంపై కూడా ప్రధానం తాము దృష్టి సారిస్తామ"ని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (సేల్స్) ఎస్. సాహ్నే తెలిపారు.
గడచిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో జనరల్ మోటార్స్ ప్రదర్శించిన సరికొత్త 2012 వెర్షన్ చెవర్లే కాప్టివా ఎమ్‌పివిని కూడా భారత్‌లో విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. గడచిన ఆగస్టులో ఓ చిన్న తరహా వాణిజ్య వాహనాన్ని విడుదల చేస్తామని జనరల్ మోటార్స్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని సాహ్నే ముందు ప్రస్తావించగా, 2012లో తాము అసలు ఎల్‌సివి విడుదల చేయాలని ప్లాన్ చేయనేలేదని అన్నారు.


Click it and Unblock the Notifications








