దీపావళి నాటికి మార్కెట్లోకి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ చెవర్లే బీట్
అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ అందిస్తున్న చిన్న కారు చెవర్లే బీట్‌లో ఓ అప్‌గ్రేడెడ్ వేరియంట్ త్వరలోనే భారత మార్కెట్లో విడుదల కానుంది. ఈ పండుగ సీజన్‌లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ చెవర్లే బీట్‌ను కంపెనీ దేశీయ విపణిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. కాగా.. కొత్త ఫేస్‌లిఫ్టెడ్ చెవర్లే బీట్ ఇప్పటికే అమెరికన్ మార్కెట్లో (అక్కడి మార్కెట్లో దీని చెవర్లే స్పార్క్) విడుదలై మంచి సక్సెస్‌ను కూడా సాధించింది.
ప్రస్తుతం కొత్త బీట్‌ను జనరల్ మోటార్స్ ఇండియాలో ట్రైల్ రన్ నిర్వహిస్తోంది. ఫేస్‌లిఫ్ట్ బీట్‌తో పాటుగా, కంపెనీ ఈ ఏడాది మార్కెట్లో విడుదల చేయనున్న చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి, సెయిల్ సెడాన్లను కూడా జనరల్ మోటార్స్ టెస్ట్ రన్ నిర్వహిస్తోంది. కొత్త ఫేస్‌లిఫ్ట్ చెవర్లే బీట్ ఇటీవలే చెన్నై మార్కెట్లో ట్రైల్ రన్ నిర్వహిస్తుండగా కెమెరాలకు చిక్కింది. ఇప్పుడు ఈ స్పై చిత్రాలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి.
చెవర్లే నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో బీట్ కూడా ఒకటి. ఇండియన్ మార్కెట్లో చెవర్లే అందిస్తున్న ఉత్పత్తులను ఒక్కొక్కటిగా అప్‌గ్రేడ్ చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే కొత్త చెవర్లే తవేరా నియో3 ఎమ్‌పివి, చెవర్లే కాప్టివా ఎస్‌యూవీ, మరింత పవర్‌ఫుల్ చెవర్లే క్రూజ్ మోడళ్లను కంపెనీ ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసింది. కాగా.. ప్రస్తుతం చెవర్లే అందిస్తున్న ఆప్ట్రా మాగ్నమ్, ఏవియో, ఏవియో యూ-వీఏ మోడళ్ల అమ్మాకాలు/ఉత్పత్తిని ఈ ఏడాది చివరి నాటికి పూర్తిగా నిలిపివేయాలని కంపెనీ భావిస్తోంది.
అయితే, వీటి స్థానాలను కొత్త మోడళ్లతో జనరల్ మోటార్స్ భర్తీ చేయనుంది. చెవర్లే ఏవియో హ్యాచ్‌బ్యాక్, చెవర్లే ఏవియో యూ-వీఏ సెడాన్‌ల స్థానంలో సరికొత్త చెవర్లే సెయిల్ హ్యాచ్‌బ్యాక్, చెవర్లే సెయిల్ సెడాన్‌లను కంపెనీ మార్కెట్లోకి తీసుకురానుంది. ఇవే కాకుండా, అధిక మైలేజీనిచ్చే కొత్త స్పార్క్, మారుతి సుజుకి ఎర్టిగాకు సవాలుగా చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివిలను జనరల్ మోటార్స్ 2012లో విడుదల చేయనుంది.
కొత్త చెవర్లే బీట్ విషయానికి వస్తే, ఇందులో సరికొత్త ఫ్రంట్ బంపర్, వెడల్పాటి గ్రిల్, టాప్-ఎండ్ వేరియంట్లో 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, అధిక నాణ్యత కలిగిన ఇంటీరియర్స్ వంటి మార్పులు చోటుచేసుకోవచ్చని తెలుస్తోంది. ఈ మార్పులన్నీ అమెరికన్ వెర్షన్ చెవర్లే బీట్‌లో గమనించవచ్చు. ఈ సెగ్మెంట్లో త్వరలో మార్కెట్లోకి రానున్న అప్‌గ్రేడెడ్ ఫోర్డ్ ఫిగో, అప్‌గ్రేడెడ్ మారుతి సుజుకి రిట్జ్ మోడళ్లకు ధీటుగా అప్‌గ్రేడెడ్ చెవర్లే బీట్ నిలువనుంది.


Click it and Unblock the Notifications









