హైదరాబాద్‌లో కొత్త క్రూజ్‌ని విడుదల చేసిన జిఎమ్

జనరల్ మోటార్స్‌ (జిఎమ్) అందిస్తున్న తాజాగా దేశీయ విపణిలో విడుదల చేసిన అప్‌గ్రేడెడ్ పవర్‌ఫుల్ ప్రీమియం సెడాన్ చెవర్లే క్రూజ్‌ను కంపెనీ రాష్ట్ర మార్కెట్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. సరికొత్త ఎఫ్‌ఏఎమ్ జెడ్ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌ను జోడించిన 2012 చెవర్లే క్రూజ్ సెడాన్ పాత వెర్షన్ కన్నా మరింత అధిక పనితీరును కనబరుస్తుందని కంపెనీ పేర్కొంది.

ఈ ఇంజన్‌లో ఉపయోగించిన హై పెర్ఫార్మెన్స్ కామన్ రైల్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, ఆధునిక ఎలక్ట్రానిక్ నియంత్రిత వేరియబుల్ జియోమెట్రీ టర్బోచార్జర్ల ద్వారా ఇది కేవలం తొమ్మిది సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మూడు వేరియంట్లలో లభించే ఈ కారు ధరలు రూ.14.08 లక్షల నుంచి రూ.15.94 లక్షల (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) రేంజ్‌లో ఉన్నాయి.


కొద్దిగా మార్పు చేయబడిన ఫ్రంట్ గ్రిల్, రివైజ్డ్ ఫ్రంట్ బంపర్, సరికొత్త హెడ్‌ల్యాంప్స్ అండ్ ఫాగ్‌ల్యాంప్స్, కొత్త డిజైన్ కలిగి అల్లాయ్ వీల్స్ వంటి మార్పులను ఈ అప్‌గ్రేడెడ్ క్రూజ్‌లో గమనించవచ్చు. గ్లోబల్ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని, దానికి అనుగుణమైన ఇంటిరీయర్లు ఎక్స్టీరియర్లో ఈ సరికొత్త చెవర్లే క్రూజ్‌ను జనరల్ మోటార్స్ రూపొందించింది.

కారు లోపల గమనిస్తే, ఇంటీరియర్స్‌లో పెద్దగా మార్పులు లేవు కానీ, మరింత సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేసిన వెనుక సీట్, ఎయిర్ వెంట్స్, సరికొత్త ఆడియో సిస్టమ్‌లు ఇందులో ప్రధానంగా చెప్పుకోదగిన ఫీచర్లు. ఈ కొత్త చెవర్లే క్రూజ్‌లో సరికొత్త ఇంజన్ (జెడ్ సిరీస్)ను ఉపయోగించారు. ఈ 2.0 లీటర్ కామన్-రైల్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 166 పిఎస్‌ల శక్తిని, 380 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న పాత క్రూజ్ ఇంజన్ పెర్ఫామెన్స్‌తో పోల్చుకుంటే ఇది 15 బిహెచ్‌పిల అదనపు పవర్, 53 ఎన్ఎమ్‌ల అదనపు టార్క్‌‌లను ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా, ప్రస్తుతం ఉన్న 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ స్థానంలో 6-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌లతో ఇది లభ్యం కానుంది. కొత్త క్రూజ్ ప్రతి లీటరుకు 17 కి.మీ. మైలేజీనివ్వనుంది.

హైదరాబాద్ మార్కెట్లో లభించే చెవర్లే క్రూజ్ వేరియంట్లు, వాటి ఎక్స్-షోరూమ్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
* Chevrolet Cruze - 2.0 LT MT BS4 (Fam Z) : Rs 14,08,966
* Chevrolet Cruze - 2.0 LTZ MT BS4 (Fam Z) : Rs 15,02,609
* Chevrolet Cruze - 2.0 LTZ AT BS4 (Fam Z) : Rs 15,94,198
* Chevrolet Cruze - 2.0 LT MT BS4 : Rs 13,06,050
* Chevrolet Cruze - 2.0 LTZ MT BS4 : Rs 14,71,951
* Chevrolet Cruze - 2.0 LTZ AT BS4 : Rs 15,61,257

More from DriveSpark

Article Published On: Friday, June 29, 2012, 17:40 [IST]
English summary
General Motors India has launched the upgraded new Chevrolet Cruze D-segment sedan in Hyderabad at a starting price of Rs 14.08 lakhs. The new Cruze has been priced Rs 1.31 lakhs high over the current model. The sedan will be available in three variants.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+