రతన్ టాటాకు గుడ్‌బై, సైరస్ మిస్త్రీకు స్వాగతం

By Ravi

సాల్ట్ నుంచి సాఫ్ట్‌వేర్ వరకూ దాదాపు అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న టాటా గ్రూప్ గురించి మనకు కొత్తగా పరిచయాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. వ్యాపారం అంటే కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, ప్రలోభాలు కాదని నిబద్ధత, అంకిత భావం వంటి నైతిక విలువలతో కూడా వ్యాపారం చేయవచ్చని నిరూపించిన వ్యాపార దిగ్గజం రతన్ టాటా నేడు టాటా గ్రూపుకు గుడ్‌బై చెబుతున్నారు. టాటా సన్స్ చైర్మన్‌గా రతన్ టాటా నేడు పదవీవిరమణ చేయనున్నారు. ఆయన స్థానాన్ని 44 ఏళ్ల సైరస్ మిస్త్రీ పూరించనున్నారు.

డిసెంబర్ 28, 1937న జన్మించిన రత్‌న్ టాటా నేటితో 75 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. గత 50 ఏళ్లుగా టాటా గ్రూప్‌ సంస్థలకు సేవలందించిన టాటా, తన ఈ 50 ఏళ్ల ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కొని, ప్రపంచం గర్వించదగిన మైలురాళ్లను అధిగమించారు. అలాగే, పలు విమర్శలను కూడా ఎదుర్కున్నాడు. వ్యాపారం అనేది వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, విస్తృతమైన వినియోగదారుల అవసరాలను తీర్చడం కోసమేమనని చాటిచెప్పిన గొప్ప వ్యాపారవేత్త రతన్ టాటా.

వ్యాపారంలో టాటా అనుసరించిన నీతి, నిజాయితీ, నాణ్యత మరియు ఆదర్శప్రాయమైన అభివృద్ధి మార్గాలే ఆయనను ఈ స్థానంలో ఉండటానికి దోహదపడ్డాయి. అందుకే ఆయనను భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లతో సత్కరంచింది. ప్రపంచదేశాలు సైతం ఆయనను పలు డాక్టరేట్లతో గౌరవించాయి. యావత్ పారిశ్రామిక ప్రపంచం గర్విస్తున్న రతన్ టాటా మన భారతదేశానికి చెందిన వ్యక్తి కావటం, సగటు భారతీయుడిగా నిజంగా మనం గర్వించదగిన విషయం.

రతన్ టాటా 1962లో టాటా స్టీల్ జంషెడ్పూర్ ప్లాంట్‌లో అప్రెంటిస్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1991లో జెఆర్‌డి టాటా నుంచి రతన్ టాటా గ్రూప్ చైర్మన్ బాధ్యతలను స్వీకరించారు. అప్పట్లో రూ.10 వేల కోట్ల టర్నోవర్ కలిగిన టాటా గ్రూప్ విలువ నేడు 100.09 బిలియన్ డాలర్ల (సుమారు రూ.475,721 కోట్ల)కు పెరిగేలా చేయటంలో రతన్ టాటా నిరంతరాయంగా, అవిశ్రాంతంగా కృషి చేశారు. ఆయన తమ టాటా గ్రూపును కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాకుండా, విదేశాలకు సైతం విస్తరించారు.

1991: టాటా గ్రూపు భాద్యత స్వీకరణ

1991: టాటా గ్రూపు భాద్యత స్వీకరణ

రతన్ టాటా 1962లో టాటా స్టీల్ జంషెడ్పూర్ ప్లాంట్‌లో అప్రెంటిస్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1991లో జెఆర్‌డి టాటా నుంచి రతన్ టాటా గ్రూప్ చైర్మన్ బాధ్యతలను స్వీకరించారు. అప్పట్లో రూ.10 వేల కోట్ల టర్నోవర్ కలిగిన టాటా గ్రూప్ విలువ నేడు 100.09 బిలియన్ డాలర్ల (సుమారు రూ.475,721 కోట్ల)కు పెరిగేలా చేయటంలో రతన్ టాటా నిరంతరాయంగా, అవిశ్రాంతంగా కృషి చేశారు. ఆయన తమ టాటా గ్రూపును కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాకుండా, విదేశాలకు సైతం విస్తరించారు.

1998: టాటా మోటార్స్ మొదటి ప్యాసింజర్ కారు

1998: టాటా మోటార్స్ మొదటి ప్యాసింజర్ కారు

ప్రస్తుతం టాక్సీగా అత్యంత ప్రాచుర్యాన్ని సంపాధించుకున్న 'టాటా ఇండికా' టాటా మోటార్స్ నుంచి వచ్చి మొట్టమొదటి కారు. 1998లో టాటా మోటార్స్ తమ మొట్టమొదటి ప్యాసింజర్ కారు టాటా ఇండికాను ఆవిష్కరించింది.

2004: టాటా దేవూ హెవీ ట్రక్ టేకోవర్

2004: టాటా దేవూ హెవీ ట్రక్ టేకోవర్

కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం దేవూ కమర్షియల్ వెహికల్ కంపెనీ టాటా మోటార్స్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం వాణిజ్య వాహన విభాగంలో దేశంలోనే అతిపెద్ద కంపెనీ అవతరించిన టాటా మోటార్స్ అప్పట్లో దేవూ బ్రాండ్ కార్లను కూడా భారత్‌లో విక్రయిచింది.

2004: న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్‌లో టాటా మోటార్స్

2004: న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్‌లో టాటా మోటార్స్

టాటా మోటార్స్ 2004 సంవత్సరంలో న్యూయార్స్ స్టాక్ ఎక్సేంజ్‌లోనికి ప్రవేశించింది. ఈ విధంగా టాటా మోటార్స్ తమ అంతర్జాతీయ ప్రయాణాన్ని ప్రారభించి, గ్లోబల్ మార్కెట్లో సైతం మంచి గుర్తింపును తెచ్చుకుంది.

2008: టాటా నానో కారు ఆవిష్కరణ

2008: టాటా నానో కారు ఆవిష్కరణ

మధ్య తరగతి ప్రజల కారు కలను నిజం చేస్తూ, లక్షల రూపాయలకే కారు అంటా టాటా మోటార్స్ అభివృద్ధి చేసిన, ప్రపంచంలో కెల్లా అత్యంత చవకైన కారు టాటా నానోను కంపెనీ ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ చవక కారుల విషయంలో అసాధ్యాన్ని సాధ్యం చేసి రతన్ టాటాను యావత్ పారిశ్రమిక రంగం కొనియాడింది.

2008: జాగ్వార్ ల్యాండ్ రోవర్ స్వాధీనం

2008: జాగ్వార్ ల్యాండ్ రోవర్ స్వాధీనం

పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను టాటా మోటార్స్ అమెరికాకు చెందిన ఫోర్డ్ మోటార్స్ నుంచి కొనుగోలు చేసింది. భారీ నష్టాల్లో ఉన్న ఈ కంపెనీను టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్నప్పుడు యావత్ ప్రపంచం నవ్వుకుంది. అప్పట్లో నష్టాలు ఉన్న కంపెనీ ఇప్పుడు భారీ లాభాలను తెచ్చిపెడుతూ టాటా మోటార్స్ కీర్తిని ప్రపంచాని చాటుతోంది. ఇప్పటి జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను ప్రపంచం ఇదెలా సాధ్యమైందని నివ్వెరపోతుంది.

2012: టాటా వారసుడి కోసం వేట

2012: టాటా వారసుడి కోసం వేట

టాటా గ్రూపు నుంచి రతన్ టాటా తప్పుకోనున్నట్లు 2012 ఆరంభంలో ప్రకటించారు. అప్పటి నుంచే ఆయన వారసుడి కోసం వేట మొదలైంది. ఈ వేటలో టాటా వారసుడిగా సైరస్ మిస్త్రీని ఎన్నుకోవటం జరిగింది.

2012: రతన్ టాటా పదవీవిరమణ

2012: రతన్ టాటా పదవీవిరమణ

గత 50 ఏళ్లుగా టాటా గ్రూప్‌ సంస్థలకు సేవలందించిన రతన్ టాటా నేడు (డిసెంబర్ 28, 2012) టాటా గ్రూపు నుంచి తప్పుకోనున్నారు. ఈ 50 ఏళ్ల తన అలుపెరగని ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కొని, ప్రపంచం గర్వించదగిన మైలురాళ్లను టాటా అధిగమించారు.

రతన్ టాటా సందేశం

రతన్ టాటా సందేశం

"సరైన నిర్ణయాలు తీసుకోవటాన్ని నేను విశ్వసించను, నిర్ణయాలు తీసుకున్న తర్వాత వాటిని సరిగ్గా మార్చుకుంటాను" - రతన్ టాటా


పలు కంపెనీలను స్వాధీనం చేసుకొని అభివృద్ధిలోకి తీసుకువచ్చారు. నష్టాల్లో ఉన్న కంపెనీలు సైతం కొనుగోలు చేసి వాటిని లాభాల్లోకి తీసుకువచ్చి, మార్కెట్ విమర్శకుల నోళ్లు మూయించారు. టాటా కొనుగోలు చేసిన విదేశీ కంపెనీల్లో, బ్రిటన్‌కు చెందిన టెట్లీ (2000 సంవత్సరంలో 450 మిలియన్ డాలర్లకు టాటా టీ టేకోవర్ చేసుకుంది), కోరస్‌ (2007లో 6.2 బిలియన్ పౌండ్లకు టాటా స్టీల్ స్వాధీనం చేసుకుంది). బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (ఫోర్డ్ మోటార్ నుంచి 2.3 బిలియన్ డాలర్లకు టాటా మోటార్స్‌ హస్తగతం చేసుకుంది) కొన్ని ముఖ్యమైవిగా చెప్పుకోవచ్చు. యావత్ ఆటోమొబైల్ ప్రపంచం ఆశ్చర్యపడేలా, ప్రపంచంలో కెల్లా అత్యంత చవకైన కారు 'టాటా నానో'ను లక్ష రూపాయల ధరకే విడుదల చేసి, మధ్యతరగతి ప్రజల కారు కలను నిజం చేసిన వ్యక్తి రతన్ టాటా.

రతన్ టాటా గురించి, సమాజానికి ఆయన అందించిన సేవల గురించి చెప్పుకుంటూ పోతో ఓ మహా గ్రంధమే తయారవుతుంది. గడచిన 50 ఏళ్లుగా అలుపెరగని పరుగుతో టాటా గ్రూపును ముందుకు నడిపిన రతన్ టాటా ఇప్పటికీ అలసిపోలేదు. టాటా సన్స్ గ్రూపు నుంచి ఛైర్మన్ బాధ్యతల నుంచి తొలగిపోయినప్పటికీ, బోర్డులో ఛైర్మన్ ఎమిరటస్ కొనసాగుతారు. బ్రహ్మచారిగా మిగిలిపోయిన రతన్ టాటా, టాటా గ్రూపుకు ఇప్పటి వరకూ సంతృప్తిగా భాద్యతలు నిర్వర్తించానని, రిటైరైన తర్వాత టెక్నాలజీపై దృష్టి సారిస్తూ, పియానో నేర్చుకుంటూ, విమానాలు నడుపుతూ కాలం వెల్లబుచ్చుతానని చెప్పుకొచ్చారు.

More from DriveSpark

Article Published On: Friday, December 28, 2012, 12:58 [IST]
English summary
India's most powerful businessman Ratan Tata, will retire today, ending his 50-year journey with Tata Sons Group. Ratan Tata, who turns 75 today, will hand over the reins of the group to 44-year-old Cyrus Mistry, who was chosen his successor last year and formally appointed chairman earlier this month.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+