పవర్‌ఫుల్ ఆడి క్యూ7లో కత్రినా కైఫ్ కి సవారీ
మై నేమ్ షీలా.. షీలా కి జవానీ.. అంటూ తీస్‌మార్ ఖాన్ సినిమాలో కుర్రకారును కిర్రెక్కించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ నేడు 28వ జన్మదినాన్ని జరుపుకుంటుంది. మరి ఈ బర్త్ డే బేబీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దామా..!! వయసు మళ్లుతున్న తరగని అందచందాలతో, ఆకట్టుకునే అభినయంతో యువతను ఉర్రూతలూగిస్తున్న ఈ ముద్దుగుమ్మకు ఆడి కార్లు అంటే భలే క్రేజ్.
అందుకే, గత జనవరిలో ఆడి ఇండియా తమ కొత్త క్రాసోవర్ ఆడి క్యూ3 ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించడానికి రావల్సిందిగా కత్రినా కైఫ్‌ను పిలువగానే టక్కున ఒప్పేసుకుంది. ఆడి ఇండియా కంపెనీకు, బాలీవుడ్ సెలబ్రిటీలకు ఉన్న బంధం ఈ నాటిది కాదు. ఉచిత ప్రమోషన్ కోసం ఆడి ఇండియా బాలీవుడ్ సెలబ్రిటీలను బాగానే ఉపయోగించుకుంటుంది.
సరే ఇదంతా అటుంచింతే, ఈ బాలీవుడ్ భామ వద్ద ఓ పవర్‌ఫుల్ 'ఆడి క్యూ7' ఎస్‌యూవీ కారు ఉంది. ఆడి ఇండియా దేశీయ విపణిలో క్యూ సిరీస్‌లో అందిస్తున్న అత్యంత విలాసవంతమైన కారు ఇదే. ఆడి క్యూ7 మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్లతో పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో లభ్యమవుతుంది. 3.0 లీటర్ టిడి క్వాట్రో డీజిల్ ఇంజన్ 180 కి.వా. శక్తిని, 550 ఎన్ఎమ్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 12.62 కి.మీ. మైలేజీనిస్తుంది.
అలాగే, 4.2 లీటర్ టిడిఐ క్వాట్రో డీజిల్ వేరియంట్ గరిష్టంగా 250 కి.వా. శక్తిని, 800 ఎన్ఎమ్ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటర్ డీజిల్‌కు 10.10 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఇకపోతే 3 లీటర్ టిఎఫ్ఎస్ఐ క్వాట్రో వి6-సిలిండర్ పెట్రోల్ వేరియంట్ గరిష్టంగా 245 కి.వా. శక్తిని, 440 ఎన్ఎమ్ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు 8.62 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఈ మూడు ఇంజన్లు కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభ్యమవుతాయి.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన భద్రతా ఫీచర్లతో ఆడి ఇండియా తమ పవర్‌ఫుల్ క్యూ7 ఎస్‌యూవీని అభివృద్ధి చేసింది భారత మార్కెట్లో ఆడి క్యూ7 ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.60 లక్షలకు పైగానే ఉంది.


Click it and Unblock the Notifications









