మారుతి స్విఫ్ట్ కార్లు ఖాలీ.. మరి టాటా విస్టా కొంటారా..?

మారుతి సుజుకి అందిస్తున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను సవాల్ చేస్తూ టాటా మోటార్స్ అందిస్తున్న కొత్త విస్టా కోసం గత అక్టోబర్ నెలలో టాటా ఓ మోటార్స్ ఓ స్పెషల్ క్యాంపైన్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో మారుతి సుజుకి స్విఫ్ట్ వెయిటింగ్ పీరియడ్ అధికంగా ఉండటంతో, స్విఫ్ట్ కన్నా తమ కొత్త విస్టా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంటుందని టాటా మోటార్స్ చెప్పే ప్రయత్నం చేసింది.

అయితే, ప్రస్తుతం మారుతి సుజుకి మానేసర్ ప్లాంట్ లాకౌట్ కారణంగా, స్విఫ్ట్ ఉత్పత్తి నిలిచిపోవటం, మార్కెట్లో స్విఫ్ట్ స్టాక్ ఖాలీ అయిపోయాయి. ఇకపై కొత్తగా మారుతి స్విఫ్ట్ కార్లను కొనాలనుకునే వారు ఎన్ని నెలలు వేచి ఉండాలో కూడా తెలియని పరిస్థితి నెలకొనడంతో, ఈ మోడల్‌కు సమానమైన ఇతర కార్ బ్రాండ్‌లను కస్టమర్లు ఎంచుకుంటున్నారు. కార్ కంపెనీలు కూడా ఈ పరిస్థితిని అడ్వాంటేజ్‌గా తీసుకొని తమ కార్లను హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో టాటా విస్టా విఎక్స్ (ఏబిస్) మోడల్‌కు మారుతి సుజుకి స్విఫ్ట్ విడిఐ మోడల్‌కు మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలేంటో ఈ కథనంలో తెలుసుకుందా రండి.

ఇంజన్, పవర్, పెర్ఫామెన్స్, మైలేజ్:
పెర్ఫామెన్స్ విషయంలో రెండు మోడళ్లు కూడా సమానంగానే ఉంటాయి. ఈ రెండు కార్లలోనూ ఒకే ఇంజన్‌ను ఉపయోగించారు. ఇవి రెండూ కూడా 1248 సీసీ, 4-సిలిండర్, కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజన్ సిస్టమ్‌తో 75 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తాయి. మైలేజ్ విషయంలో కూడా టాటా విస్టా, మారుతి స్విఫ్ట్‌లు రెండూ ఇంచు మించు సమానంగానే ఉంటాయి. టాటా విస్టా లీటరుకు 22.3 కి.మీ. మైలేజీనిస్తే, మారుతి స్విఫ్ట్ లీటరుకు 22.9 కి.మీ. మైలేజీనిస్తుంది.

ఇంటీరియర్ స్పేస్:
కారు లోపల స్థలం విషయంలో ఈ రెండింటికీ కాస్తంత వ్యత్యాసం ఉంది. ఈ విషయంలో టాటా విస్టానే ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే.. టాటా విస్టా.. 3795 మి.మీ. పొడవును, 1695 మి.మీ. వెడల్పును మరియు 1550 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది. అదే మారుతి స్విఫ్ట్ విషయానికి వస్తే ఇది 3850 మి.మీ. పొడవును, 1695 మి.మీ. వెడల్పును మరియు 1530 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది. టాటా విస్టాలో వెనుక సీట్లు విశాలంగా ఉండి అధిక లెగ్‌రూమ్‌ను కలిగి ఉంటాయి. మారుతి స్విఫ్ట్‌లో కాస్తంత ఇరుకుగా ఉంటుంది. విస్టా బూట్‌స్పేస్ 232 లీటర్లు. స్విఫ్ట్ బూట్‌స్పేస్ 204 లీటర్లు.

ఇంటీరియర్స్:
టాటా విస్టాలో బ్లాక్ అండ్ సహారా బీజ్ వర్ణంలో ఉండే విశాలమైన ఇంటీరియర్స్, మృదువైన ఫినిషింగ్‌తో రెండు రంగుల కలయితో ఉండే డ్యాష్‌బోర్డ్, 60:40 నిష్పత్తిలో మడుచుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన వెనుక సీట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కానీ, మారుతి స్విఫ్ట్‌లో ఇవేవీ లేవు.

ఫీచర్లు:
కొత్త టాటా విస్టాలో, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఆక్స్-ఇన్, యూఎస్‌బి పోర్ట్ కనెక్టివిటీతో కూడిన ఇంటిగ్రేటెడ్ మ్యూజిక్ సిస్టమ్, ఐదు మొబైల్ ఫోన్ల వరకూ కనెక్ట్ చేసుకునేందుకు వీలుగా ఉండే బ్లూ 5, స్టీరింగ్‌పై ఉండే ఆడియో కంట్రోల్స్, ఇంటలిజెంట్ రియర్ వైపర్, అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ ఏసి కంట్రోల్ ఉన్నాయి. కానీ స్విఫ్ట్ విడిఐలో ఈ ఫీచర్లేవీ లభించవు.

వారంటీ:
టాటా విస్టా 2 ఏళ్లు లేదా 75,000 కి.మీ. (ఏది ముందు ముగిస్తే అది) వారంటీతో లభిస్తుంది. మారుతి సుజుకి స్విఫ్ట్ 2 ఏళ్లు లేదా 40,000 కి.మీ. వారంటీతో లభిస్తుంది. వారంటీ పరంగా చూసుకున్న కూడా స్విఫ్ట్ కన్నా విస్టానే బెస్ట్ అని చెప్పవచ్చు.

ధర:
ఇక ధర విషయానికి వస్తే.. టాటా విస్టా ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర రూ.5.74 లక్షలుగా ఉండగా మారుతి సుజుకి స్విఫ్ట్ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర రూ.5.98 లక్షలుగా ఉంది.

మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్:
మొత్తంమీద చూస్తే.. కొత్త విస్టా ధర విషయంలోనూ, ఫీచర్ల విషయంలోనూ అన్ని విధాలుగా బెస్ట్ అని చెప్పవచ్చు. విస్టా చూడటానికి హ్యాచ్‌బ్యాక్ మోడల్ అయినప్పటికీ.. ఇందులో సెడాన్ క్లాస్ అనుభూతిని పొందవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, August 14, 2012, 14:20 [IST]
English summary
Tata Motors recently launched the new Vista hatchback. The Indian carmaker has added several new features to the face-lifted Vista. It has also claims the new hatchback will offer a sedan like feel. Tata Motors is so confident about the features of the new Vista that it has directly taken on market leader Maruti Suzuki through an internet ad campaign and a specially created website that compares the diesel variants of the Vista and the new Swift.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+