డీజిల్ వాహనాలపై ఏటా అధిక రోడ్ ట్యాక్స్: కిరీట్ పారిఖ్

By Ravi

Car
ప్రభుత్వం సబ్సిడీ ధరకే విక్రయిస్తున్న డీజిల్ ధరను పెంచడానికి బదులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకున్నట్లోంది. ఇందులో భాగంగానే, డీజిల్ వానాలపై ఏటా అధిక మొత్తాలలో రహదారుల పన్ను (రోడ్ టాక్స్)ను విధించాలని యోచిస్తోంది. వాహనాలకు డీజిల్‌ను సబ్సిడీ ధరలకే విక్రయిస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వంపై పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు గాను డీజిల్‌తో నడిచే ఎస్‌యూవీలపై ఏటా అధిక రోడ్ టాక్‌లను విధించాలని ప్రణాళికా సంఘం మాజీ సభ్యులు కిరీట్ పారిఖ్ ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు చేశారు.

ఇదే గనుక అమల్లోకి వస్తే.. డీజిల్ ఎస్‌యూవీలపై ఏకంగా రూ.50,000 వరకూ అధిక రోడ్ ట్యాక్స్‌ను వసూలు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. కొత్తగా కొనుగోలు చేసే డీజిల్ వాహనాలపై వన్ టైమ్ డీజిల్ పన్ను విధించడానికి ప్రత్యామ్నాయంగా, ప్రస్తుతం అమల్లో ఉన్న వన్ టైమ్ రోడ్ ట్యాక్స్ విధానాన్ని తొలగించి, దాని స్థానంలో వార్షిక పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని పారిఖ్ ప్రతిపాదించారు. పెట్రోల్, డీజిల్ వాహనాల రోడ్ ట్యాక్స్ మధ్య వ్యత్యాసాన్ని పాటించాలని ఆయన అన్నారు.

పెట్రోల్ వాహనాలతో పోలిస్తే, డీజిల్ వాహనాలపై రోడ్ ట్యాక్స్ సుమారు రూ.10,000 నుంచి రూ.20,000 వరకూ అధికంగా ఉండొచ్చని, డీజిల్ ఎస్‌యూవీలపై ఇది రూ.50,000 వరకూ అధికంగా ఉండొచ్చని వివరించారు.మరోవైపు, డీజిల్‌ ఇంధనానికి మార్కెట్ నిర్ధారిత రేటును నిర్ణయించాలని, దానిపై సబ్సిడీని లీటరుకు రూ.9 లకు మాత్రమే పరిమితం చేయాలని పారిఖ్ అన్నారు. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖకు సిఫార్సులు పంపించామని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

More from DriveSpark

Article Published On: Tuesday, November 27, 2012, 17:14 [IST]
English summary
Former Planning Commission member Kirit Parikh has been made a proposal to Finance Ministry for levying higher annual road tax on diesel sports utility vehicles (SUVs). "Instead of looking at a one-time diesel tax on new purchases, the alternative could be to abolish the existing one-time road tax and make it annual and apply a differential between petrol and diesel vehicles" Parikh said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+