త్వరలో సిఎన్‌జి వేరియంట్లలో రానున్న హోండా సిటీ
ప్రస్తుతం, ప్రకృతి సాన్నిహిత్యమైన సిఎన్‌జితో నడిచే వాహనాలకు డిమాండ్ పెరుగుతుండటం, మెట్రో నగరాల్లో సిఎన్‌జి లభ్యత కూడా అధికమవుతున్న నేపథ్యంలో, హోండా సిటీలో సిఎన్‌జి వేరియంట్‌ను ప్రవేశపెట్టే అంశంపై కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఒకప్పుడు ఈ సెగ్మెంట్లోకి నెంబర్ వన్‌గా ఉన్న హోండా సిటీ, ప్రస్తుతం పోటీదారుల నుంచి పోటీ పెరుగుతున్న నేపథ్యంలో ఇందులో కొత్త వేరియంట్లను తీసుకువచ్చే అంశంపై కంపెనీ దృష్టి సారించింది.
ఇందులో భాగంగానే, మిడ్ లెవల్ వేరియంట్ ఆటోమేటిక్ వెర్షన్ సిటీని కంపెనీ ఇటీవలే విడుదల చేసింది. ఈ సెగ్మెంట్లో ఇతర కార్ మేకర్లకు డీజిల్ వెర్షన్‌లు అందుబాటులో ఉండటం, హోండా వద్ద అసలు డీజిల్ కార్ల పోర్ట్‌ఫోలియోనే లేకపోవడంతో హోండా సిటీ అమ్మకాలు తగ్గముఖం పడుతూ వస్తున్నాయి. ఇదే సమయంలో ఫోక్స్‌వ్యాగన్ వెంటో, స్కొడా ర్యాపిడ్, మారుతి సుజుకి ఎస్ఎక్స్4, హ్యుందాయ్ వెర్నా, ఫోర్డ్ ఫియస్టా కార్ల అమ్మకాలు మాత్రం పెరుగుతూ వస్తున్నాయి.
దీంతో మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవాలంటే, హోండా డీజిల్ ఇంజన్లను పరిచయం చేయడంతో పాటు అధిక మైలేజీనిచ్చే సిఎన్‌జి వెర్షన్లు ప్రవేశపెట్టాలని అవసరం ఎంతైనా ఉంది. హోండా సిటీ సెడాన్‌లో ఓ రిఫ్రెష్డ్ వెర్షన్‌ను గడచిన డిసెంబర్ నెల కంపెనీ మార్కెట్లో విడుదల చేసింది. సరసమైన ధరతో, సరికొత్త లుక్ మరియు ఫీచర్లతో వచ్చిన ఈ కారుకు మంచి స్పందన లభించింది.
ప్రస్తుతం హోండా సిటీలో లభిస్తున్న వేరియంట్ల వాటి ధరల (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) వివరాలు ఇలా ఉన్నాయి:
* City Corporate : INR 737,500
* City 1.5 E MT : INR 796,000
* City 1.5 S MT : INR 850,000
* City 1.5 V MT : INR 903,500
* City SAT : INR 925,500
* City 1.5 V AT : INR 979,000
* City 1.5 V MT Sunroof : INR 989,000
* City 1.5 V AT Sunroof : INR 1,064,500


Click it and Unblock the Notifications









