హోండా అమేజ్ డీజిల్ మైలేజ్, ధరలు, విడుదల తేది!
జపనీస్ కార్ కంపెనీ హోండా అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ 'హోండా బ్రయో' ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా కంపెనీ అభివృద్ధి చేసిన 'హోండా అమేజ్' సెడాన్ విడుదలకు ముస్తాబైంది. ఈనెల 23న ఇది తొలుత థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదల కానుంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సెడాన్ భారత మార్కెట్లో విడుదల కానుంది. ఎర్త్ డ్రీమ్స్ సంస్థతో కలిసి హోండా అభివృద్ధి చేసిన డీజిల్ ఇంజన్‌ను ఈ కొత్త ఎంట్రీ లెవల్ సెడాన్‌లో ఉపయోగించనున్నారు. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఈ అధునాతన డీజిల్ ఇంజన్ లీటరుకు 24 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని సమాచారం.
థాయ్‌లాండ్ మార్కెట్లో హోండా బ్రయో సెడాన్ (హోండా అమేజ్) ప్రారంభ ధర 4,55,000 టిహెచ్‌బి (రూ.8.18 లక్షలు) లుగా ఉండగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.5,23,500 టిహెచ్‌బి (రూ.9.39 లక్షలు) లుగా ఉంది. హోండా అమేజ్ సెడాన్ ఎస్ ఎమ్‌టి, ఎస్ ఏటి, వి ఎమ్‌టి, వి ఏటి అనే నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్ అమేజ్‌లో 1.2 లీటర్, 4-సిలిండర్, 16-వాల్వ్ పెట్రలో ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 90 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేసింది. పెట్రోల్ వెర్షన్ అమేజ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కూడా లభ్యం కానుంది. థాయ్‌లాండ్, ఇండియా వంటి ఆసియా మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ ఇంజన్‌ను అధిక మైలేజీనిచ్చేలా తీర్చిదిద్దింది.

హోండా అమేజ్ సెడాన్ - విడుదల
బ్రయో హ్యాచ్‌బ్యాక్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా హోండా అభివృద్ధి చేసిన అమేజ్ సెడాన్‌ను ఈనెల 23న థాయ్‌లాండ్ మార్కెట్లో కంపెనీ విడుదల చేయనుంది.

హోండా అమేజ్ సెడాన్ - ఇండియా లాంచ్
హోండా అమేజ్ సెడాన్ తొలుత థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదల కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఇండియన్ మార్కెట్లో విడుదల కానుంది.

హోండా అమేజ్ సెడాన్ - డీజిల్
హోంజా అమేజ్ సెడాన్ పెట్రోల్ వెర్షన్‌తో పాటుగా డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభ్యం కానుంది.

హోండా అమేజ్ సెడాన్ - డీజిల్ ఇంజన్ పెర్ఫామెన్స్
డీజిల్ వెర్షన్ అమేజ్‌లో 1.5 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ఇది గరిష్టంగా 75 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది

హోండా అమేజ్ సెడాన్ - డీజిల్ మైలేజ్
హోండా అమేజ్ డీజిల్ వెర్షన్ లీటరుకు 24 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వనున్నట్లు సమాచారం.

హోండా అమేజ్ సెడాన్ - ధరలు
థాయ్‌లాండ్ మార్కెట్లో హోండా బ్రయో సెడాన్ (హోండా అమేజ్) ప్రారంభ ధర 4,55,000 టిహెచ్‌బి (రూ.8.18 లక్షలు) లుగా ఉండగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.5,23,500 టిహెచ్‌బి (రూ.9.39 లక్షలు) లుగా ఉంది.

హోండా అమేజ్ సెడాన్ - వేరియంట్స్
హోండా అమేజ్ సెడాన్ ఎస్ ఎమ్‌టి, ఎస్ ఏటి, వి ఎమ్‌టి, వి ఏటి అనే నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది.

హోండా అమేజ్ సెడాన్ - పెట్రోల్ ఇంజన్
పెట్రోల్ వెర్షన్ అమేజ్‌లో 1.2 లీటర్, 4-సిలిండర్, 16-వాల్వ్ పెట్రలో ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 90 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేసింది. పెట్రోల్ వెర్షన్ అమేజ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కూడా లభ్యం కానుంది.
డీజిల్ వెర్షన్ అమేజ్‌లో 1.5 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ఇది గరిష్టంగా 75 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తు, లీటరుకు 24 కి.మీ. మైలేజీని ఇవ్వనుంది. ఇది కేవలం మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ వేరియంట్లో మాత్రమే లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్సైజ్ రాయితీని పొందేందుకు గాను హోండా అమేజ్ సెడాన్‌ను 4 మీటర్ల పొడవు కన్నా తక్కువగా ఉండేలా కంపెనీ డిజైన్ చేసింది. ఇది ఈ సెగ్మెంట్లోని కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, త్వరలో మార్కెట్లోకి రానున్న సబ్ ఫోర్-మీటర్ మహీంద్రా వెరిటో మొదలైన మోడళ్లకు పోటీగా నిలువనుంది.


Click it and Unblock the Notifications








