థాయ్‌లాండ్ మార్కెట్లో హోండా అమేజ్ సెడాన్ విడుదల

By Ravi

హోండా మోటార్స్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ 'హోండా బ్రయో' ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ అభివృద్ధి చేసిన 'హోండా అమేజ్' సెడాన్‌‌ థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదలైంది. అక్కడి మార్కెట్లో ఈ కారును 'బ్రయో అమేజ్' అనే పేరుతో పిలుస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఈ బుజ్జి సెడాన్ భారత మార్కెట్లో కూడా అందుబాటులోకి రానుంది. హోండా బ్రయో అమేజ్ సెడాన్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. హోండా నుంచి వస్తున్న మొదటి డీజిల్ కారు కూడా అమేజ్ కావటం విశేషం.

థాయ్‌లాండ్ మార్కెట్లో హోండా బ్రయో సెడాన్ (హోండా అమేజ్) ఎస్ ఎమ్‌టి, ఎస్ ఏటి, వి ఎమ్‌టి, వి ఏటి అనే నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది. హోండా అమేజ్ సెడాన్ పెట్రోల్ వెర్షన్ అమేజ్‌లో 1.2 లీటర్, 4-సిలిండర్, 16-వాల్వ్ పెట్రలో ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 90 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేసింది. పెట్రోల్ వెర్షన్ అమేజ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కూడా లభ్యం కానుంది. డీజిల్ వెర్షన్ అమేజ్‌లో, ఎర్త్ డ్రీమ్స్ సంస్థతో కలిసి హోండా అభివృద్ధి చేసిన 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 100 హెచ్‌పిల శక్తిని, 210 ఎన్‌మ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హోండా బ్రయో అమేజ్

హోండా బ్రయో అమేజ్

హోండా బ్రయో అమేజ్

హోండా బ్రయో అమేజ్

హోండా బ్రయో అమేజ్

హోండా బ్రయో అమేజ్

హోండా బ్రయో అమేజ్

హోండా బ్రయో అమేజ్

హోండా బ్రయో అమేజ్

హోండా బ్రయో అమేజ్

హోండా బ్రయో అమేజ్

హోండా బ్రయో అమేజ్

హోండా బ్రయో అమేజ్

హోండా బ్రయో అమేజ్

హోండా బ్రయో అమేజ్

హోండా బ్రయో అమేజ్

హోండా బ్రయో అమేజ్

హోండా బ్రయో అమేజ్

హోండా బ్రయో అమేజ్

హోండా బ్రయో అమేజ్


పెట్రోల్ వెర్షన్ హోండా అమేజ్ లీటరుకు సుమారు 18-20 కి.మీ. మైలేజీని, డీజిల్ వెర్షన్ అమేజ్ లీటరుకు సుమారు 22-24 కి.మీ. మైలేజీని ఇవ్వనుంది. ఎక్సైజ్ రాయితీని పొందేందుకు గాను హోండా అమేజ్ సెడాన్‌ను 4 మీటర్ల పొడవు కన్నా తక్కువగా ఉండేలా కంపెనీ డిజైన్ చేసింది. ఇది ఈ సెగ్మెంట్లోని కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, త్వరలో మార్కెట్లోకి రానున్న సబ్ ఫోర్-మీటర్ మహీంద్రా వెరిటో మొదలైన మోడళ్లకు పోటీగా నిలువనుంది.

థాయ్‌లాండ్ మార్కెట్ ప్రకారం, హోండా బ్రయో అమేజ్ సెడాన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:

  • హోండా బ్రయో అమేజ్ ఎస్ ఎమ్‌టి - రూ. 8.19 లక్షలు
  • హోండా బ్రయో అమేజ్ ఎస్ ఏటి - రూ. 8.89 లక్షలు
  • హోండా బ్రయో అమేజ్ వి ఎమ్‌టి - రూ. 8.69 లక్షలు
  • హోండా బ్రయో అమేజ్ వి ఏటి - రూ. 9.40 లక్షలు

(పై ధరలు భారత కరెన్సీ ప్రకారం, ఇండియన్ మార్కెట్లో ఈ సెడాన్ ధరలు ఇంకా తక్కువగా ఉండే ఆస్కారం ఉంది.)

More from DriveSpark

Article Published On: Tuesday, November 27, 2012, 12:26 [IST]
English summary
Honda has launched its Brio based sedan, the Amaze in Thailand with a starting price of approximately Rs.8.19 lakhs. Honda has launched only the petrol variants of the Brio Amaze as it is being called in Thailand. The new Honda Amaze will be available in four variants: S MT, S AT, V MT and V AT. Here are the approximate prices of each of the Honda Amaze variants.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+