అక్టోబర్ మధ్యభాగంలో రానున్న హోండా బ్రయో ఆటోమేటిక్
జపనీస్ కార్ కంపెనీ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (గతంలో హోండా సియోల్ కార్స్ ఇండియా లిమిటెడ్) దేశీయ విపణిలో అందిస్తున్న చిన్న కారు బ్రయోలో ఆటోమేటిక్ వేరియంట్ విడుదలకు ముహుర్తం ఖరారైంది. హోండా బ్రయో ఇప్పటి వరకూ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో లభ్యమవుతోంది. అయితే, వినియోగదారులు ఇందులో ఆటోమేటిక్ వేరియంట్‌ను కూడా కోరుతుండటంతో ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ కలిగిన వేరియంట్‌ను కంపెనీ ఈనెల మధ్యభాగంలో (మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, అక్టోబర్ 15, 2012) మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.
హోండా సిటి ఆటోమేటిక్‌లో ఉపయోగిస్తున్న 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)నే హోండా బ్రయో ఆటోమేటిక్‌లో కూడా ఉపయోగించనున్నారు. హోండా బ్రయో టాప్ ఎండ్ వేరియంట్ (వి)లో ఈ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్‌ను కంపెనీ మార్కెట్లో విడుదల చేసే ఆస్కారం ఉంది. హోండా బ్రయో ఆటోమేటిక్ ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకి ఏ-స్టార్, హ్యుందాయ్ ఐ10 వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది. ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కలిగి హోండా బ్రయో ధర మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ కలిగిన హోండా బ్రయో ధర కన్నా రూ.60,000 - రూ.80,000 అధికంగా ఉండొచ్చని అంచనా.

హోండా బ్రయో - ఆటోమేటిక్
హోండా బ్రయో ఇప్పటి వరకూ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో లభ్యమవుతోంది. అయితే, వినియోగదారులు ఇందులో ఆటోమేటిక్ వేరియంట్‌ను కూడా కోరుతుండటంతో ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ కలిగిన వేరియంట్‌ను కంపెనీ ఈనెల మధ్యభాగంలో (మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, అక్టోబర్ 15, 2012) మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

హోండా బ్రయో - ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్
హోండా సిటి ఆటోమేటిక్‌లో ఉపయోగిస్తున్న 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)నే హోండా బ్రయో ఆటోమేటిక్‌లో కూడా ఉపయోగించనున్నారు. హోండా బ్రయో టాప్ ఎండ్ వేరియంట్ (వి)లో ఈ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్‌ను కంపెనీ మార్కెట్లో విడుదల చేసే ఆస్కారం ఉంది.

హోండా బ్రయో ఆటోమేటిక్ - కాంపిటీషన్
హోండా బ్రయో ఆటోమేటిక్ ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకి ఏ-స్టార్, హ్యుందాయ్ ఐ10 వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది.

హోండా బ్రయో ఆటోమేటిక్ - ధర
ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కలిగి హోండా బ్రయో ధర మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ కలిగిన హోండా బ్రయో ధర కన్నా రూ.60,000 - రూ.80,000 అధికంగా ఉండొచ్చని అంచనా.

హోండా బ్రయో - ఇంజన్
ప్రస్తుతం హోండా బ్రయో కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభ్యంవుతుంది. ఇందులో ఉపయోగించిన 1.2 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 88 పిఎస్‌ల శక్తిని, 109 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు 18.4 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.
ప్రస్తుతం హోండా బ్రయో కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభ్యంవుతుంది. ఇందులో ఉపయోగించిన 1.2 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 88 పిఎస్‌ల శక్తిని, 109 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు 18.4 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్ హోండా బ్రయో మైలేజ్, మ్యాన్యువల్ వేరియంట్ మైలేజ్ కన్నా తక్కువగా ఉండనుంది. రాష్ట్ర మార్కెట్లో అందుబాటులో ఉన్న హోండా బ్రయో వేరియంట్లు వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
* హోండా బ్రయో ఈ ఎమ్‌టి - రూ.4.14 లక్షలు
* హోండా బ్రయో ఎస్ ఎమ్‌టి - రూ.4.52 లక్షలు
* హోండా బ్రయో ఎస్ (ఆప్షనల్) ఎమ్‌టి - రూ.5.07 లక్షలు
* హోండా బ్రయో వి ఎమ్‌టి - రూ.5.32 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)


Click it and Unblock the Notifications








