బ్రయో ఆధారిత సెడాన్ పేరు 'హోండా అమేజ్'

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ దేశీయ విపణిలో అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ 'హోండా బ్రయో' ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా ఓ సెడాన్‌ వెర్షన్ మార్కెట్లోకి రానున్నట్లు ఇదివరకటి కథనాల్లో మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా, థాయ్‌లాండ్‌లో టెస్టింగ్ నిర్వహిస్తున్న హోండా బ్రయో బేస్డ్ సెడాన్ ఫోటోలను కూడా మనం తిలకించాం. అయితే, తాజా అప్‌డేట్ ప్రకారం, హోండా మోటార్స్ బ్రయో ఆధారంగా నిర్మిస్తున్న ఈ సెడాన్‌కు ఓ కొత్త పేరును కూడా ఖరారు చేసింది.

హోండా బ్రయో ఫ్లాట్‌ఫామ్‌పై నిర్మితమవుతున్న ఈ సెడాన్‌కు కంపెనీ 'హోండా అమేజ్' అనే పేరును పెట్టింది. హోండా అమేజ్ సెడాన్ ముందుగా థాయ్‌లాండ్ మార్కెట్లోను అనంతరం ఇండియా మార్కెట్లోను విడుదల కానుంది. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ ఈనెల 23న (నవంబర్ 23, 2012) వెల్లడించనుంది. ఆసియా మార్కెట్లలో కస్టమర్ల అవసరాలను, అభిరుచులను దృష్టిలో ఉంచుకొని హోండా మోటార్స్ ఈ అమేజ్ సెడాన్‌ను రూపొందించింది.

హోండా అమేజ్

హోండా అమేజ్

హోండా మోటార్స్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ 'బ్రయో' ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మితమవుతున్న సెడాన్‌‌కు 'అమేజ్' పేరును కంపెనీ ఖరారు చేసింది.

హోండా అమేజ్ - థాయ్‌లాండ్

హోండా అమేజ్ - థాయ్‌లాండ్

హోండా అమేజ్ సెడాన్‌ను కంపెనీ మొదటగా థాయ్‌లాండ్ మార్కెట్లోను, అనంతరం ఇండియన్ మార్కెట్లోను విడుదల చేయనుంది. వచ్చే ఏడాది మధ్య భాగం నాటికి ఈ ఈ మోడల్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంది.

హోండా అమేజ్ - టెస్టింగ్

హోండా అమేజ్ - టెస్టింగ్

హోండా అమేజ్ సెడాన్‌ను కంపెనీ ఇప్పటికే థాయ్‌లాండ్ రోడ్లపై టెస్టింగ్ నిర్వహిస్తోంది. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను నవబర్ 23, 2012న కంపెనీ వెల్లడించనుంది.

హోండా అమేజ్ - డీజిల్

హోండా అమేజ్ - డీజిల్

భారత మార్కెట్లో హోండా అమేజ్ సెడాన్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభ్యం కానుంది. హోండా తాజాగా అభివృద్ధి చేసిన అధునాతన డీజిల్ ఇంజన్‌ను ఈ కారులో ఉపయోగించనుంది. ఇండియాలో మొట్టమొదటి హోండా డీజిల్ కారుగా కూడా హోండా అమేజ్ రికార్డు సృష్టించనుంది.

హోండా బ్రయో ఎమ్‌పివి

హోండా బ్రయో ఎమ్‌పివి

మరోవైపు హోండా మోటార్స్ తమ పాపులర్ బ్రయో హ్యాచ్‌బ్యాక్ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఓ ఎమ్‌పివిని కూడా అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసినదే. ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి ఎర్టిగాకు గట్టి పోటీ ఇచ్చేలా కంపెనీ ఓ ఎమ్‌పివిని తయారు చేస్తుంది. ఇది కూడా వచ్చే ఏడాదిలోనే మార్కెట్లో విడుదల కావచ్చని సమాచారం.


ఆసక్తికరమైన విషయం ఏంటంటే, భారత మార్కెట్లో హోండా అమేజ్ సెడాన్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభ్యం కానుంది. హోండా తాజాగా అభివృద్ధి చేసిన అధునాతన డీజిల్ ఇంజన్‌ను ఈ కారులో ఉపయోగించనుంది. ఇండియాలో మొట్టమొదటి హోండా డీజిల్ కారుగా కూడా హోండా అమేజ్ రికార్డు సృష్టించనుంది. ఈ సెగ్మెంట్లోని టాటా ఇండిగో ఈసిఎస్, కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, త్వరలో మార్కెట్లోకి రానున్న సబ్ ఫోర్-మీటర్ మహీంద్రా వెరిటో మొదలైన మోడళ్లకు ధీటుగా హోండా అమేజ్ నిలువనుంది.

ప్రస్తుతం దేశీయ విపణిలో లభిస్తున్న హోండా బ్రయో హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించిన 4-సిలిండర్, 1.2 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్‌నే పెట్రోల్ వెర్షన్ బ్రయో సెడాన్‌లోను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 88 పిఎస్‌ల శక్తిని, 109 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హోండా బ్రయో హ్యాచ్‌బ్యాక్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. డీజిల్ వెర్షన్ బ్రయో సెడాన్ విషయానికి వస్తే.. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ఎక్సైజ్ రాయితీని పొందేందుకు గాను హోండా బ్రయో సెడాన్‌ను 4 మీటర్ల పొడవు కన్నా తక్కువగా ఉండేలా కంపెనీ డిజైన్ చేయనుంది.

More from DriveSpark

Article Published On: Friday, November 9, 2012, 12:51 [IST]
English summary
The Honda Brio's sedan version has been officially named as Amaze. The Brio Amaze will be launched in 2013 with a diesel engine.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+